సినిమాకు ఉండే అన్ని క్రాఫ్ట్స్‌లో మ్యూజిక్ కూడా ఒక భాగమే. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కథ యావరేజ్‌గా ఉన్నా.. మ్యూజిక్, టేకింగ్ సూపర్‌గా ఉంటే.. మూవీ హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే మ్యూజిక్ డైరెక్టర్స్‌ను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నారు మేకర్స్. ముందు నుండి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్‌తోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు దర్శకులు. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా అదే పనిచేస్తున్నాడు. తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ గురించి బయటికొచ్చిన క్రేజీ అప్డేట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో రివీల్ చేసింది టీమ్.


మ్యూజికల్ హిట్స్..
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మెలోడీ బ్రహ్మ మణిశర్మ కాంబినేషన్ ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ హిట్. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘పోకిరి’, ‘చిరుత’, ‘ఇస్మార్ట్ శంకర్’లాంటి మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. ఇవన్నీ మ్యూజికల్‌గా మాత్రమే కాకుండా బాక్సాఫీస్ కలెక్షన్స్ దగ్గర కూడా సెన్సేషన్ సృష్టించాయి. అయితే మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా కోసం మణిశర్మనే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు పూరీ. ఈ సినిమాకు ప్రీక్వెల్ అయిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఆల్బమ్.. అప్పట్లో సూపర్ సక్సెస్‌ను అందుకుంది. అదే విధంగా ‘డబుల్ ఇస్మార్ట్’ ఆల్బమ్ కూడా మ్యూజిక్ లవర్స్‌కు నచ్చేలా ప్లాన్ చేస్తున్నారట మణిశర్మ.


మరింత స్టైలిష్‌గా..
ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’ షూటింగ్ ముంబాయ్‌లో జరుగుతోంది. బాలీవుడ్ నటుడు సంజ్ దత్‌ను ఈ మూవీలో విలన్‌గా ఎంపిక చేశాడు పూరీ. ఇక రామ్, సంజయ్ దత్ మధ్య సీన్స్ ఎలా ఉంటాయో చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు పూరీ జగన్నాథ్. తన సొంత బ్యానర్ పూరీ కనెక్ట్స్ ద్వారా చార్మీతో కలిసి ‘డబుల్ ఇస్మార్ట్’ను నిర్మిస్తున్నాడు. రామ్.. ఇప్పటివరకు తన కెరీర్‌లో నటించిన అన్ని సినిమాల్లోకంటే ‘ఇస్మార్ట్ శంకర్’లోనే చాలా స్టైలిష్‌గా, డిఫరెంట్ లుక్‌తో కనిపించాడు. అయితే ‘డబుల్ ఇస్మార్ట్’లో కూడా తన లుక్స్ మరింత స్టైలిష్‌గా ఉంటాయని సమాచారం.


విడుదల ఎప్పుడంటే..?
‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నా.. అప్పుడే దీని విడుదల తేదీని అనౌన్స్ చేసింది మూవీ టీమ్. 2024 మార్చ్ 8న శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో, ప్యాన్ ఇండియా రేంజ్‌లో ‘డబుల్ ఇస్మార్ట్’ను విడుదల చేయాలని పూరీ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్, సంజయ్ దత్ మినహా మిగతా క్యాస్ట్ వివరాలు ఇంకా బయటికి రాలేదు. ‘డబుల్ ఇస్మార్ట్’లో రామ్‌కు జోడీగా ఎవరు నటిస్తారో అన్న విషయం తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల బోయపాటి దర్శకత్వంలో నటించిన ‘స్కంద’తో మంచి హిట్‌ను అందుకున్న రామ్.. ‘డబుల్ ఇస్మార్ట్’తో అదే ఫార్మ్‌ను కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు. ఒకప్పుడు లవ్ స్టోరీలతో హిట్ అందుకున్న రామ్.. ఇప్పుడు పూర్తిగా యాక్షన్ హీరోగా మారిపోయాడు. పూర్తిగా కమర్షియల్ సినిమాలు చేస్తూ మాస్ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.


Also Read: బాలీవుడ్ స్పై యూనివర్స్‌లో కొత్త ట్విస్ట్! సల్మాన్, షారుఖ్‌తో పాటు మరో స్టార్ హీరో!


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply