Celebs First Mother's Day 2024: మథర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం తమ తల్లులకు విష్ చేస్తూ, వారి స్పెషల్ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంటున్నారు నెటిజన్లు. అందులో భాగంగానే సెలబ్రిటీలు కూడా తమ తల్లులతో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇక ఈసారి మొదటిసారిగా తమ పిల్లలతో మథర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అందులో చాలావరకు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలే ఉన్నారు.


ఉపాసన కొణిదెల


మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసనకు గతేడాది.. అంటే 2023 జూన్ 20న క్లిన్ కారా జన్మించింది. అంటే ఈ ఏడాది వారు మొదటిసారిగా క్లిన్ కారాతో కలిసి మథర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కూతురు పుట్టి దాదాపు సంవత్సరం అవుతున్నా ఇప్పటికీ తన ఫేస్‌ను రివీల్ చేయలేదు రామ్ చరణ్, ఉపాసన.


ఇలియానా


ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్‌ను తన గ్లామర్‌తో ఆకట్టుకున్న ఇలియానా.. 2023 ఆగస్ట్ 1న తన బేబీ బాయ్‌కు జన్మనిచ్చింది. మొదటిసారి ఇలియానా తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసినప్పటి నుండి నెటిజన్లు షాక్‌లోనే ఉన్నారు. ఇలియానాకు ఇంకా పెళ్లి కాలేదు కదా అని చాలారోజులు చర్చించుకున్నారు. అవన్నీ పట్టించుకోకుండా తన బేబీ బాయ్ కోవా ఫనిక్స్ డోలాతో తన మొదటి మథర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటోంది ఇలియానా.


స్వర భాస్కర్


బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఏ హడావిడి లేకుండా పెళ్లి చేసుకున్నవారిలో స్వర భాస్కర్ ఒకరు. ఫాహద్ అహ్మద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వర.. 2023 సెప్టెంబర్ 23న తన కూతురు రాబియాకు జన్మనిచ్చింది. ఈ ఏడాది మథర్స్ డేను మొదటిసారి తన కూతురితో కలిసి సెలబ్రేట్ చేసుకోనుంది స్వర భాస్కర్.






దీపికా కక్కర్


బాలీవుడ్‌లో బుల్లితెరపై తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది దీపికా కక్కర్. తన పెళ్లి కూడా ఒక సెన్సేషన్‌గానే నిలిచిపోయింది. తనతో పాటు సీరియల్స్‌లో నటించే షోయబ్ ఇబ్రహింకు అందరి ముందు ప్రపోజ్ చేసి మరీ ప్రేమించి పెళ్లి చేసుకుంది దీపికా. వీరిద్దరికీ 2023 జులై 21న బేబీ బాయ్ రుహాన్ జన్మించాడు. 2024 మథర్స్ డేను రుహాన్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటోంది దీపికా.






సనా ఖాన్


పలు తెలుగు సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి ఉన్నట్టుండి వెండితెర నుండి దూరమయిపోయింది సనా ఖాన్. బిజినెస్ మ్యాన్ అయిన ముఫ్తీ అనాస్ సయ్యద్‌ను పెళ్లి చేసుకొని పూర్తిగా ప్రేక్షకులకు దూరమయిపోయింది. వీరిద్దరికీ గతేడాది జులై 5న మగబిడ్డ జన్మించాడు. మొదటిసారి తన బేబీ బాయ్‌తో మథర్స్ డేను జరుపుకుంటోంది సనా ఖాన్.






ఇషితా దత్


బాలీవుడ్‌లో గ్లామర్ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది ఇషితా దత్తా. వత్సల్ సేత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇషితాకు వాయు సేత్ జన్మించాడు. 2023 జులై 19న వాయు పుట్టడంతో 2024 మథర్స్ డేను తన కొడుకుతో కలిసి జరుపుకుంటోంది ఇషితా.


రుబీనా ధిల్లక్


బీ టౌన్ బుల్లితెరపై మరో ఫేమస్ నటి అయిన రుబీనా ధిల్లక్ కూడా మొదటిసారి తన పిల్లలతో కలిసి మథర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తన కో యాక్టర్ అయిన అభినవ్ షుక్లాను ప్రేమించి పెళ్లి చేసుకున్న రుబీనాకు 2023 నవంబర్‌లో కవల పిల్లలు జన్మించారు. ఆ ఇద్దరు బేబీ గర్ల్స్‌తో మథర్స్ డే జరుపుకోవడానికి సిద్ధమయ్యింది ఈ బుల్లితెర నటి.


Also Read: 'అమ్మ' ప్రేమను వెండితెరపై ఆవిష్కరించిన టాలీవుడ్ సినిమాలు ఇవే!