Mohan Babu : కొండలను సైతం కదిలించగల డైనమిక్ సైకియాట్రిస్ట్‌గా మోహన్ బాబు

Mohan Babu First Look From Agni Nakshathram Movie : డా. మంచు మోహన్ బాబు ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'అగ్ని నక్షత్రం'. ఈ రోజు సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 

Continues below advertisement

పద్మశ్రీ పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్ డా మోహన్ బాబు (Mohan Babu), ఆయన కుమార్తె లక్ష్మీ మంచు (Lakshmi Manchu) ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సినిమా 'అగ్ని నక్షత్రం' (Agni Nakshathram).

Continues below advertisement

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. తండ్రీ కుమార్తెలు మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న మంచు నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో మోహన్ బాబు ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేశారు. అలాగే, ఆయన క్యారెక్టర్ కూడా రివీల్ చేశారు.

'అగ్ని నక్షత్రం' సినిమాలో డైనమిక్ సైకియాట్రిస్ట్, ప్రొఫెసర్ విశ్వామిత్ర పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. ''తన ఆలోచనలతో, ఆదర్శాలతో కొండలను సైతం కదిలించగల డాషింగ్, డైనమిక్ సైకియాట్రిస్ట్... ప్రొఫెసర్ విశ్వామిత్ర. తన గంభీరమైన లుక్‌తో డిఫరెంట్ క్యారెక్టర్‌లో మోహన్ బాబు  గారు ప్రేక్షకుల్ని అలరించనున్నారు'' అని చిత్ర బృందం పేర్కొంది.

Also Read : బాయ్‌కాట్ 'లాల్ సింగ్ చ‌డ్డా' - ఖాన్స్ సినిమాపై నెటిజన్స్ ఫైర్
 
విలక్షణ నటుడు సముద్రఖని కీలక పాత్రలో, మలయాళ నటుడు సిద్దిక్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో విశ్వంత్ కథానాయకుడు. చిత్రా శుక్లా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read : ఆగస్టు 1 నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్ - నిర్ణయం ప్రకటించిన చాంబర్, 'దిల్' రాజు

Continues below advertisement