PS1 - First Single : 'పొంగే నది' - మనసు దోచే నది - 'పోన్నియన్ సెల్వన్'లో ఫస్ట్ సాంగ్ వచ్చేసింది, వినండి

PS1 First Single Out Now : మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా సినిమా 'పొన్నియన్ సెల్వన్'. ఇందులో తొలి పాట 'పొంగే నది'ని నేడు విడుదల చేయనున్నారు.

Continues below advertisement

చియాన్ విక్రమ్ (Chiyaan Vikram), 'జయం' రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధాన తారలుగా రూపొందుతున్న చిత్రం 'పొన్నియన్ సెల్వన్' (Ponniyin Selvan 1 Movie). మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సినిమా (PS1 Movie)లో తొలి పాట 'పొంగే నది' (Ponge Nadi) గ్లింప్స్‌ విడుదల చేశారు.
 
మణిరత్నం సినిమా అంటే ఏఆర్ రెహమాన్ సంగీతం కంపల్సరీ. 'పొన్నియన్ సెల్వన్'కు సైతం ఆయనే సంగీతం అందిస్తున్నారు. అంతే కాదు... ఈ పాటను ఏఆర్ రెహనా, బాంబే బకాయతో కలిసి ఆలపించారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు.

Continues below advertisement

ఆరు గంటలకు సాంగ్ విడుదల చేయడాని కంటే ముందు గ్లింప్స్‌ విడుదల చేశారు. ప్రముఖ డ్రమ్మర్ శివమణి, సంగీత దర్శకుడు రెహమాన్ ఈ గ్లింప్స్‌లో ఉన్నారు. ఆల్రెడీ విడుదలైన గ్లింప్స్‌ సాంగ్ మీద అంచనాలు పెంచింది. కార్తీ మీద ఈ పాట తెరకెక్కించినట్టు స్టిల్స్ చూస్తే తెలుస్తోంది. 

Also Read : హాట్‌స్టార్‌లో 'ది వారియర్', ఆహాలో 'పక్కా కమర్షియల్', జీ తెలుగులో 'కెజియఫ్ 2' - విడుదల ఎప్పుడంటే?
 
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న 'పొన్నియన్ సెల్వన్ 1' సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట. ఈ సినిమాలో జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read : ఆగస్టు 1 నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్ - నిర్ణయం ప్రకటించిన చాంబర్, 'దిల్' రాజు

Continues below advertisement