మంచు విష్ణు (Vishnu Manchu) హీరోగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’ (Kannappa Movie). అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై రూపొందుతోంది. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ నటి ప్రీతీ ముకుందన్ కథానాయిక. న్యూజిలాండ్ అడవుల్లో ఈ సినిమా అధిక భాగం చిత్రీకరణ జరిగింది. ప్రభాస్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి బహుభాషా నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలోకి మోహన్ బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే.


కలెక్షన్ కింగ్‌ అని ప్రేక్షకుల చేత పిలిపించుకున్న నటుడు మోహన్ బాబు. తెలుగు సినీ పరిశ్రమలో 49 ఏళ్లు పూర్తి చేసుకొని 50వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ‘కన్నప్ప’ చిత్రంలోని ఆయన రోల్ గురించి ప్రకటించింది, ఫస్ట్‌ లుక్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో మహాదేవ శాస్త్రిగా ఆయన కనిపించనున్నారు.






Also Read'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?


మే నెలలో ఈ సినిమా టీజర్ ను తొలి సారిగా కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. అక్కడ మంచి స్పందన వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది. కొన్ని రోజులకు విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకూ సాగిన పోరాట సన్నివేశాలు, ప్రభాస్, మోహన్ లాల్ షాట్స్... ఇవన్నీ సినిమాపై అంచనాలు పెంచాయి.


వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల
Kannappa Movie Release Date: తొలుత డిసెంబర్ 2024లో ‘కన్నప్ప’ను విడుదల చేయాలని యూనిట్ భావించింది. అయితే, పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో క్వాలిటీ పరంగా రాజీ పడకూడదని మరింత సమయం కేటాయిస్తోంది. అందుకని, వచ్చే ఏడాది వేసవికి సినిమా విడుదలను వాయిదా వేశారు. 


ప్రభాస్ ఫస్ట్‌ లుక్ రిలీజ్ కోసం యూనిట్ ప్లాన్ చేసింది. అయితే... ఇంతలోనే ఆ స్టిల్ లీక్ కావడంతో టీమ్ షాక్ అయింది. ఈ లుక్ ను లీక్ చేసిన వాళ్లను పట్టిస్తే రూ.5 లక్షలు ఇస్తామని మంచు విష్ణు ప్రకటించారు. అయితే లీక్ చేసిన వ్యక్తి క్షమాపణ చెప్పడంతో వివాదం ముగిసింది. శివుని పాత్రలో అక్షయ్ కుమార్, నందీశ్వరునిగా ప్రభాస్ కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రం ద్వారా మంచు విష్ణు తన కుమారుడు ఆవ్రామ్ ను వెండితెరకు పరిచయం చేస్తున్నారు. ఆయన చిన్నప్పటి పాత్రలో ఆవ్రామ్ కనిపించనున్నారు.


Also Readజీబ్రా రివ్యూ: సత్యదేవ్ వర్సెస్ డాలీ ధనుంజయ... హీరోలు ఇద్దరిలో ఎవరిది పైచేయి? మూవీ హిట్టేనా?