Continues below advertisement


Mirai Movie :  తేజసజ్జా, మంచుమనోజ్ నటించిన మిరాయ్ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటివరకూ తెరపై చూడని కొత్తకథ అంటూ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ సొంతం చేసుకుంది. యోధగా తేజ సజ్జా, మహావీర్ లామా రోల్ లో మనోజ్ నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయ్. చిన్న చిన్న మైనస్ లు ఉన్నప్పటికీ ఓవరాల్ గా థియేటర్ కి కుటుంబంతో సహా వెళ్లి ఎంజాయ్ చేయాల్సిన సినిమా అనే టాక్ వచ్చింది.


హనుమన్ సినిమాలో ఆంజనేయుడు నేరుగా హిమాలయాల నుంచి దిగివచ్చినట్టే..మిరాయ్ లో ఆయన గురువుగారు శ్రీరామచంద్రుడు దిగివస్తాడు. హనుమాన్ సినిమా మొత్తం లెక్క..క్లైమాక్స్ లో హనుమాన్ చాలీశా బ్యాగ్రౌండ్ లో వస్తుండగా ఆంజనేయుడు దిగివచ్చే సన్నివేశం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. నిజంగా థియేటర్లో ఉన్నామా అనే సందేహం కలిగేలా హనుమాన్ ప్రత్యక్షమైనట్టు భక్తి పారవశ్యంలో మునిగిపోతారు ప్రేక్షకులు. ఇప్పుడు మిరాయ్ లోనూ సేమ్ టు సేమ్ షాట్స్ పడ్డాయ్. అక్కడ ఆంజనేయుడు అయితే ఇక్కడ శ్రీరాముడు దిగివచ్చాడు.


ఇంతకీ రాముడిగా కనిపించినది ఎవరు?


సినిమా రిలీజ్ కు ముందు రాముడిగా మహేష్ బాబు కనిపిస్తాడనే టాక్ వచ్చింది. ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత రానా రాముడిగా వచ్చాడంటున్నారు. సోషల్ మీడియాలో మొత్తం రాముడిగా కనిపించింది రానానే అంటున్నారు. కానీ అస్సలు కానేకాదు AI రాముడిని చూపించారని మరికొందరు అంటున్నారు.


ఏది నిజం?


రానా సినిమాలో ఉన్నాడన్నది నిజమే కానీ రాముడు మాత్రం కాదు. అంతా AI మాయాజాలం అంతే. పైగా కల్కి 2898 ADలో కృష్ణుడి క్యారెక్టర్ ని వెనుక నుంచి నీడలా చూపించినట్టు ఇందులో రాముడిని ప్రజెంట్ చేశారు. దీంతో రానా ఉన్నాడనే ప్రచారం జరిగింది కాబట్టి రాముడిగా రానా అనే డిస్కషన్ మొదలు పెట్టేశారు. కానీ మిరాయ్ లో ఉన్నది AI రాముడే.  హనుమాన్ సినిమాలో యానిమేటెడ్ ఆంజనేయుడిని చూపించి..హనుమాన్ 2లో క్యారెక్టర్ కోసం రిషబ్ శెట్టిని తీసుకొచ్చారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజైంది కూడా. ఇప్పుడు మిరాయ్ లోనూ సేమ్ టు సేమ్..ప్రస్తుతానికి స్క్రీన్ పై ప్రేక్షకులు చూసింది AI రాముడినే. మిరాయ్ పార్ట్ 2 అనౌన్స్ చేస్తే అసలు రాముడు ఎవరో క్లారిటీ వస్తుంది. రానా సినిమాలో ఉన్నది మాత్రం నిజమే..


మిరాయ్ లో ప్రభాస్?


ఇక సినిమాలో ప్రభాస్ నటించాడనే వార్తలూ వైరల్ అవుతున్నాయ్. కానీ ప్రభాస్ ఒక్కఫ్రేమ్ లో కూడా కనిపించడు కానీ వినిపిస్తాడు. 9 గ్రంధాల గురించి చెప్పే బ్యాగ్రౌండ్ వాయిస్ ప్రభాస్ ది. తేజసజ్జా మాట్లాడుతూ ప్రభాస్ సర్ ప్రైజ్ ఉంటుందని చెప్పడంతో డార్లింగ్ కనిపిస్తాడు అనుకున్నారంతా.. థియేటర్లలో ప్రభాస్ పిక్ ఒకటి క్రియేట్ చేసి  వైరల్ చేశారు కూడా. కానీ డార్లింగ్ కనిపించలేదు ..వినిపించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైనే ది రాజాసాబ్ వస్తోంది. అందుకే సేమ్ బ్యానర్లో వచ్చిన మిరాయ్ కి వాయిస్ ఇచ్చాడు ప్రభాస్. 


ఓవరాల్ గా చెప్పుకుంటే బాహుబలి, భళ్లాలదేవ ఇద్దరూ మిరాయ్ లో ఉన్నారు...కానీ రాముడు కాదు...