ఆమిర్ ఖాన్ (Aamir Khan) కథానాయకుడిగా నటించిన 'లాల్ సింగ్ చడ్డా' (Laal Singh Chaddha) సినిమా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో విడుదల అవుతోంది. ఆగస్టు 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్, చిరంజీవి, సినిమాలో కీలకమైన బాలరాజు పాత్రలో నటించిన అక్కినేని నాగ చైతన్యను కింగ్ నాగార్జున ఇంటర్వ్యూ చేశారు. త్వరలో ఆ ఇంటర్వ్యూ స్టార్ మా ఛానల్‌లో టెలికాస్ట్ కానుంది. అంత కంటే ముందు ప్రోమో విడుదల చేశారు.
మెగాస్టార్ మొదటి ప్రేమకథ
'లాల్ సింగ్ చడ్డా' సినిమాలో పదేళ్ల వయసు ఉన్నప్పుడు హీరో ప్రేమ పడతాడు. ఈ విషయం నాగార్జున చెప్పిన తర్వాత 'మీరు తొలిసారి ఎప్పుడు ప్రేమలో పడ్డారు?' అని చిరంజీవిని ఆమిర్ ఖాన్ అడిగారు. అప్పుడు 'గుర్తు చేసుకోనివ్వండి' అని నవ్వేసిన చిరంజీవి ''ఏడో తరగతిలో ఉన్నప్పుడు ప్రేమలో పడ్డాను. ఒక అమ్మాయి సైకిల్ తొక్కడం అంటే మా మొగల్తూరులో చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఆ అమ్మాయి సైకిల్ తొక్కుతుంటే ఎలా తొక్కుతుందో అని వెనక్కి తిరిగి చూసేవాడిని. తను ముందు చూడు అని నా ముఖాన్ని ముందుకు తిప్పేది'' అని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.
చిరంజీవితో సినిమా తీస్తా : ఆమిర్ ఖాన్
ఆమిర్ ఖాన్ సినిమాల్లో ఏదైనా సినిమా రీమేక్ చేయాలంటే తాను చేయనని చిరంజీవి చెప్పారు. మరోవైపు ఆమిర్ ఖాన్ తనకు చిరంజీవితో సినిమా చేయాలని ఉందని చెప్పారు. మెగాస్టార్‌తో తన డైరెక్షన్ లేదంటే ప్రొడక్షన్‌లో సినిమా చేస్తానని ఆయన అన్నారు. అప్పుడు చిరంజీవి ''టేక్ వన్ ఓకే కాదు కదా'' అని అనడంతో ఆమిర్ నవ్వేశారు. ''ప్రొడక్షన్ మాత్రం ఓకే. డైరెక్షన్ మాత్రం ఒప్పుకోవద్దు అండీ'' అని చిరంజీవికి నాగార్జున సలహా ఇచ్చారు. (Aamir Khan Wants to Either Direct Or Produce A Film With Megastar Chiranjeevi )
Also Read : బాయ్‌కాట్ 'లాల్ సింగ్ చడ్డా' - ఖాన్స్ సినిమాపై నెటిజన్స్ ఫైర్
ఆమిర్ మాటలు ఎడిట్ చేసేయండి : చిరంజీవి
'లాల్ సింగ్ చడ్డా'లో ఆమిర్ ఖాన్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. ఒక చిన్న పిల్లాడు... కాలేజ్ స్టూడెంట్... ఆర్మీ ఆఫీసర్... ఒక వ్యక్తి జీవితంలో వివిధ దశలను ఆమిర్ ఆవిష్కరించారు. అన్ని గెటప్స్‌లో ఆయనే కనిపించనున్నారు. 'ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా జరిగింది?' అని ఆమిర్ ఖాన్‌ను నాగార్జున ప్రశ్నించారు. అప్పుడు ఆయన వీఎఫ్స్ఎక్స్ వాళ్ళు అంతా చేశారని సమాధానం చెప్పగా... 'లాభం లేదు. ఈ మాటలు ఎడిట్ చేయండి' అని చిరంజీవి అనడం సరదాగా ఉంది. నాగార్జున లాంటి స్టార్ హీరో హోస్ట్ చేయడం అరుదు అని చిరంజీవి చెప్పారు.
Also Read : ఆగస్టు 1 నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్ - నిర్ణయం ప్రకటించిన చాంబర్, 'దిల్' రాజు