తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సమస్యల (Tollywood Issues) పరిష్కారం కోసం ఒక్కొక్కరూ ముందడుగు వేస్తున్నారు. నటీ నటుల పారితోషికాల నుంచి చిత్ర నిర్మాణ వ్యయం తగ్గింపు, వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీజు), ఎగ్జిబిటర్ సమస్యలు తదితర విషయాలపై చర్చించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందుకని, షూటింగులు బంద్ చేశారు. ఇప్పుడు సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు.


సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న చర్చల్లో భాగంగా ఈ రోజు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (Movie Artists Association), ప్రొడ్యూసర్స్ గిల్డ్ మధ్య మీటింగ్ జరిగింది. తొలుత అన్నపూర్ణ 7 ఏకర్స్‌లో మా, గిల్డ్ మధ్య మీటింగ్ జరుగుతుందని ముందు నుంచి ప్రచారం జరిగింది. అయితే... అనూహ్యంగా సెవెన్ ఏకర్స్ నుంచి 'దిల్' రాజు (Dil Raju) ఆఫీసుకు ప్లేస్ షిఫ్ట్ చేశారు.
 
మీటింగ్‌కు ఎవరెవరు వచ్చారు?
'మా' నుంచి ప్రస్తుత అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu), జీవితా రాజశేఖర్, రఘు బాబు, శివ బాలాజీ తదితరుల మీటింగ్‌కు అటెండ్ అయ్యారు. గిల్డ్ నుంచి  ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు, దామోదర్ ప్రసాద్, భోగవల్లి బాపినీడు, 'మైత్రీ మూవీ మేకర్స్' అధినేతలలో ఒకరైన యలమంచిలి రవిశంకర్, 'పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ' నుంచి వివేక్ కూచిభొట్ల తదితరులు అటెండ్ అయ్యారు.
 
ఏయే అంశాలపై చర్చ జరిగింది?
సినిమా షూటింగ్స్ బంద్ చేయడం నుంచి ఆర్టిస్టుల రెమ్యూనరేషన్, షూటింగుల్లో వేస్టేజ్, లోకల్ టాలెంట్ ఉపయోగించుకోవడం, పరభాషా నటీనటుల మెంబర్ షిప్ ఫీజు తదితర అంశాలపై కీలక చర్చ జరిగిందని సమాచారం. కాస్ట్ కంట్రోల్ కోసం,  రెమ్యూనరేషన్‌ల విషయం‌లో గిల్డ్ ప్రత్యక కమిటీ వేసింది. అయితే... ఈ సమావేశంలో ఇరు వర్గాలు ఒక నిర్ణయానికి రాలేదు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారని తెలిసింది. 


Also Read : సాయి పల్లవి 'గార్గి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - సోనీ లివ్‌లో ఎప్పట్నించి స్ట్రీమింగ్ అంటే?


ఒక్క 'మా'తో మాత్రమే కాదు... నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్, పలు విభాగాలు వరుసగా సమావేశం అవుతున్నారు. ఒక్కో సమావేశంలో ఒక్కో విభాగానికి చెందిన అంశాలపై చర్చలు సాగిస్తున్నారు. 


Also Read : నేను రొమాంటిక్ సినిమాలు చేయను - నందమూరి కళ్యాణ్ రామ్