సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గార్గి'. రానా దగ్గుబాటి సమర్పణలో తెలుగు వెర్షన్, సూర్య - జ్యోతిక దంపతుల సమర్పణలో తమిళ్ వెర్షన్ విడుదల అయ్యాయి. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుందీ సినిమా. జూలై 15న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. త్వరలో ఓటీటీలో వీక్షకులకు అందుబాటులోకి రానుంది.


ఆగస్టు 12న ఓటీటీలోకి 'గార్గి'
'గార్గి' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ (Gargi Movie OTT Release Date) ను సోనీ లివ్ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. ఈ నెల 12 నుంచి వరల్డ్ వైడ్ డిజిటల్ ప్రీమియర్ షోకి ఏర్పాట్లు చేసినట్లు సోనీ లివ్ ఈ రోజు తెలిపింది. తెలుగు, తమిళం, కన్నడ - మూడు భాషల్లోనూ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యింది.


ఎవరూ ఊహించని క్లైమాక్స్!
కన్నతండ్రిని పోలీసుల చెర నుంచి విడిపించడానికి ఓ కుమార్తె చేసే ప్రయత్నమే 'గార్గి' చిత్రకథ. చేయని తప్పుకు తండ్రి జైలు శిక్ష అనుభవిస్తున్నాడని సాయి పల్లవి పాత్ర ఆవేదన చెందుతుంది. అయితే... సినిమా చివరకు వచ్చేసరికి అందరూ షాక్ అయ్యే ముగింపుతో, ఎవరూ ఊహించని క్లైమాక్స్‌తో దర్శకుడు ఆశ్చర్యపరిచారు. 






Also Read : నేను రొమాంటిక్ సినిమాలు చేయను - నందమూరి కళ్యాణ్ రామ్


ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, ర‌విచంద్ర‌న్ రామ‌చంద్ర‌న్‌, గౌత‌మ్ రామ‌చంద్ర‌న్‌, థామ‌స్ జార్జి త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన  ఈ చిత్రానికి గోవింద్ వ‌సంత సంగీతాన్ని అందించారు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. 



Also Read : అభిమానికి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్న అక్కినేని నాగార్జున