Meena Sagar About Manchu Vishnu: సోషల్ మీడియా అనేది వచ్చినప్పటి నుంచి సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌పై మరింత ఫోకస్ పెరిగింది. వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, పెళ్లి ఎప్పుడు.. ఇలాంటి విషయాలపై ఎప్పటికప్పుడు నెటిజన్లు చర్చించుకుంటూ ఉంటున్నారు. కానీ ఒక్కొక్కసారి ఇవన్నీ శృతిమించుతున్నాయి. సినీ సెలబ్రిటీల గురించి తప్పుడు సమాచారాన్ని అందిస్తూ, నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు కొందరు యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్. దీంతో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు.. వారికి బుధ్ది చెప్పడానికి ముందుకు రాగా.. సీనియర్ నటి మీనా దీనిపై స్పందించారు.


స్పందించిన మీనా..


యంగ్ హీరోహీరోయిన్లు మాత్రమే కాదు.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతీ ఒక్కరి గురించి తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు. అలాంటి ఛానెళ్ల వల్ల సీనియర్ నటి మీనా కూడా ఇబ్బందిపడ్డారు. దీంతో యూట్యూబ్ ఛానెళ్లను రద్దు చేయాలంటూ మంచు విష్ణు తీసుకున్న నిర్ణయం మంచిదేనంటూ మీనా స్పందించారు. ‘‘ఎన్నో యూట్యూబ్ ఛానెళ్లల్లో వస్తున్న తప్పుడు కంటెంట్‌పై బలమైన యాక్షన్ తీసుకుంటున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA)కు, అధ్యక్షుడు మంచు విష్ణు చాలా పెద్ద థ్యాంక్స్. ఇండస్ట్రీ పరువును కాపాడడానికి మీరు చూపిస్తున్న డెడికేషన్ మెచ్చుకోదగినది’’ అని చెప్పుకొచ్చారు మీనా.


మంచి పని..


‘‘మేము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా కూడా పరువుకు భంగం కలిగించే కామెంట్స్‌ను ఎదిరించడంలో, మన కమ్యూనిటీని కాపాడడంలో అందరం కలిసి ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను. మనందరం కలిసి మనకోసం మనం పాజిటివ్ వాతావరణాన్ని, గౌరవాన్ని సృష్టించుకోవచ్చు. విష్ణు.. చాలా మంచి పనిచేశావు’’ అని అభినందించారు మీనా. మీనా మాత్రమే కాదు.. మరెందరో నటీనటులు కూడా మంచు విష్ణు చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. ఇన్నాళ్లు సినీ పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించడం లేదనే ధైర్యంతో కొందరు యూట్యూబర్ ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారని ఆర్టిస్టులు తెలిపారు.






ఒక్కటైన ఇండస్ట్రీ..


ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ చేసిన ఒక డార్క్ కామెడీ జోక్ దగ్గర ఇదంతా మొదలయ్యింది. ఇలా చేయడం సమాజానికి మంచిది కాదనే ఉద్దేశ్యంతో దానిని ఎదిరించడానికి కొందరు సినీ సెలబ్రిటీలు ముందుకొచ్చారు. మరికొందరు నటీనటులు వారితో చేతులు కలిపారు. అలా ఈ విషయం చాలా మలుపులు తిరిగింది. ఫైనల్‌గా సినీ పరిశ్రమలో పనిచేస్తున్న వారిని ట్రోల్ చేసే వ్యక్తులతో సీరియస్ యాక్షన్ తీసుకునే వరకు వచ్చింది. దీనిపై మరింత సీరియస్‌ యాక్షన్ ఉంటుందని యూట్యూబ్ ఛానెళ్లను రద్దు చేయడంతో మంచు విష్ణు అందరికీ వార్నింగ్ ఇచ్చాడని నెటిజన్లు అనుకుంటున్నారు.



Also Read: సమంత అలా చేయకపోతే వాళ్లు ఒప్పుకోరు, మంచు విష్ణు నిర్ణయానికి కారణం అది కాదు: కరాటే కళ్యాణి