'కేరాఫ్ కంచరపాలెం'తో తెలుగు చిత్రసీమ ప్రముఖులతో పాటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు వెంకటేష్ మహా (Venkatesh Maha). ఆ తర్వాత మలయాళ హిట్ 'మహేషింటే ప్రతీకారం' చిత్రాన్ని తెలుగులో సత్యదేవ్ హీరోగా రీమేక్ చేశారు. దర్శకుడిగా వెబ్ సిరీస్ (ఓ కథ) చేశారు. నటుడిగానూ వెబ్ సిరీస్, సినిమాల్లో నటించారు. మూడేళ్ళ తర్వాత ఆయన నుంచి మరో రీమేక్ వస్తోంది. అయితే, ఆయన దర్శకత్వంలో కాదు, నిర్మాణంలో!
తెలుగులోకి తమిళ 'మండేలా'
తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని తమిళ హాస్య నటుడు యోగిబాబు. ఆయన హీరోగా నటించిన తమిళ సినిమా 'మండేలా'. ఆ చిత్రానికి మడోన్నా అశ్విన్ దర్శకత్వం వహించారు. రాజకీయ నేపథ్యంలో, సమాజంలోని పరిస్థితులపై సెటైర్ వేస్తూ తెరకెక్కిన చిత్రమిది. శివ కార్తికేయన్ 'మహావీరుడు' తీసింది కూడా మడోన్నా అశ్వినే. ఇప్పుడు ఆ 'మండేలా' సినిమాను తెలుగులో రీమేక్ చేశారు.
సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) కథానాయకుడిగా నటించిన సినిమా 'మార్టిన్ లూథర్ కింగ్' (Martin Luther King Telugu Movie). ఇది ' మండేలా'కు రీమేక్. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించారు. దర్శకురాలిగా ఆమె తొలి సినిమా ఇది. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించింది. ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మాతలు కాగా... వెంకటేష్ మహా క్రియేటివ్ ప్రొడ్యూసర్! ఇవాళ సినిమాలో సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
అక్టోబర్ 27న 'మార్టిన్ లూథర్ కింగ్
'Martin King Luther Release Date : అక్టోబర్ 27న 'మార్టిన్ లూథర్ కింగ్' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఈ రోజు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. సినిమా ఫస్ట్ లుక్ చూస్తే... సంపూర్ణేష్ బాబు తల మీద ఓ కిరీటం, అందులో రాజకీయ నాయకులు ప్రచారం చేయడం చూడవచ్చు. డప్పు గుర్తుకే మీ ఓటు, లౌడ్ స్పీకర్ గుర్తుకు మీ ఓటు బ్యానర్లు కనిపించాయి. డప్పు గుర్తు తరఫున పోటీ చేసే రాజకీయ నాయకుడిగా సీనియర్ నరేష్ కనిపించనున్నారు.
Also Read - 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్
తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలో మార్పులు, చేర్పులు చేయడంలో వెంకటేష్ మహా క్రియేటివ్ ఇన్ పుట్స్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలైందని చెప్పవచ్చు. రాజకీయ పార్టీలు జోరుగా సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో 'మార్టిన్ లూథర్ కింగ్' సినిమాకు మంచి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయి.
Also Read : ఆత్మహత్య చేసుకున్న విజయ్ ఆంటోనీ కుమార్తె - తమిళ చిత్రసీమలో విషాదం
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial