Ilaiyaraaja Legal Action On Manjummel Boys.. Producer clarity: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా.. ఈ మధ్య ఎక్కువగా న్యూస్ లో కనిపిస్తున్నారు. కారణం ఆయన ఇష్యూ లీగల్ నోటీసులే. తను కంపోజ్ చేసిన పాటలకు కాపీరైట్స్ ఉన్నాయని, ఎవ్వరూ వాడొద్దంటూ లీగల్ నోటీసులు పంపిస్తున్నారు. అలా ఈ మధ్యే రజనీకాంత్‌కు లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు 'మంజుమ్మెల్ బాయ్స్' టీమ్‌కు కూడా నోటీసులిచ్చారు. తన పర్మిషన్ లేకుండా, తనకు కనీసం చెప్పుకుండా పాటను సినిమాలో పెట్టుకున్నారనేది ఆయన ఆరోపణ. అయితే, ఇళయరాజా పంపిన నోటీసులపై స్పందించారు ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమా ప్రొడ్యూసర్ ఆంటోని.
పాటతో ఫేమస్..
'ముంజుమ్మెల్ బాయ్స్' సినిమా.. ఈ మధ్య రిలీజైన మూవీల్లో పెద్ద హిట్ అందుకున్న సినిమా. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో కూడా దూసుకుపోయింది. మలయాళంలోనే కాకుండా అన్ని భాషల్లో ఈ సినిమా సూపర్ హిట్. అయితే, ఆ హిట్ కి ముఖ్య కారణం ‘కమ్మని ఈ ప్రేమలేఖనే’ పాట. 'గుణ' సినిమాలోని ఈ పాట ఎందరికో కనెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక అదే పాటని సినిమా మొదట్లో, క్లైమాక్స్ లో కూడా ఉపయోగించారు. దీంతో తన పర్మిషన్ లేకుండా పాటను ఉపయోగించారు అంటూ ఇళయరాజ సినిమా టీమ్ కి లీగల్ నోటీసులు పంపించారు. పాటకు సినిమాలో క్రెడిట్స్ ఇచ్చినప్పటికీ అది సరిపోదని, తనను పర్మిషన్ అడగకుండా, కనీసం చెప్పకుండా పాట వాడినట్లు ఆయన ఆ నోటీస్ లో పొందుపరిచారు.
పర్మిషన్ తీసుకున్నాం..
ఈ లీగల్ నోటీసులపై 'ముంజుమ్మెల్ బాయ్స్' సినిమా ప్రొడ్యూసర్ ఆంటోని స్పందించారు. ఆ మ్యూజిక్ వాడుకునేందుకు మ్యూజిక్ కంపెనీల నుంచి అన్ని రైట్స్ తీసుకున్నామని, ఈ పాటపై హక్కు ఉన్న రెండు కంపెనీల నుంచి పర్మిషన్ తీసుకున్నట్లు చెప్పారు. మిగతా భాషల్లో కూడా పాటను వాడుకునేందుకు రైట్స్ తీసుకున్నామని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే, ఇళయరాజా గారు మాత్రం పాటకు తనే మొదటి ఓనర్ ని అని, తనను అడగకుండా వాడుకున్నామని ఆరోపిస్తూ లీగల్ నోటీస్ పంపించినట్లు చెప్పారు.
ఇదేమి మొదటి సారి కాదు..
ఇళయరాజా ఇలా లీగల్ నోటీసులు పంపండం ఇదేమి మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన చాలాసార్లు ఇలా నోటీసులు పంపారు. దీనిపై కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ప్రొడ్యూసర్ కి ఇబ్బంది లేనంత వరకు ఇళయరాజా పాటలు వేరే సినిమాల్లో వాడొచ్చు అని చెప్పింది కోర్టు. మ్యూజిక్ కంపోజర్ ఒక్కడే ఆ పాటకు ఓనర్ కాదని స్పష్టం చేసింది. ప్రొడ్యూసర్ ఇష్టం అని వెల్లడించింది కోర్టు. మరి ఈ కేసులో ఏమవుతుందో వేచి చూడాలి.
ఇక సినిమా విషయానికొస్తే.. ఒక చిన్న స్టోరీ లైన్ ని సినిమాగా తీశారు మేకర్స్. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో సాగుతుంది ఈ సినిమా. 'గుణ' గుహలకు వెళ్లిన ఫ్రెండ్స్ అక్కడ ఫేస్ చేసిన ఇబ్బందులని, ఫ్రెండ్ కోసం మిగతా వాళ్లు పడ్డ తపన గురించి ఈ సినిమా తీశారు. ఇక 'గుణ' గుహల నేపథ్యంలో సినిమా తీయడంతో.. 'గుణ' సినిమాలోని పాట వాడాల్సి వచ్చింది. దీంతో సినిమా ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లింది.