Tharun Bhascker special song Appadappada Tandra Full Video Out : శుక్రవారం థియేటర్లలో విడుదల అవుతోన్న సినిమాల్లో 'మంగళవారం' ఒకటి. అందులో తరుణ్ భాస్కర్ స్పెషల్ సాంగ్ చేశారు. అయితే... ఆ సాంగ్ థియేటర్లలో మీకు కనిపించదు. కేవలం యూట్యూబ్ వరకు పరిమితం చేశారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... 


మనోభావాలు దెబ్బ తినే అవకాశం ఉండటంతో...
'మంగళవారం' సినిమా కోసం 'అప్పడప్పడ తాండ్ర... ఆవకాయ్ తాండ్ర' అంటూ సాగే ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. యువ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ అందులో డ్యాన్స్ చేశారు. అయితే... చాలా మంది మనోభావాలు దెబ్బ తీసేలా ఆ సాంగ్ ఉందని, లిరిక్స్ ఛేంజ్ చేయమని సెన్సార్ సభ్యులు సూచన చేశారు. ఆ పాటలో సాహిత్యం మారిస్తే అంత ప్రభావం ఉండదని సినిమా లోనుంచి పాటను తీసేశామని దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు. 'అప్పడప్పడ తాండ్ర...' పాటకు గణేష్ సాహిత్యం అందించగా... రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. అజనీష్ లోక్ నాథ్ బాణీ సమకూర్చారు.    


'అప్పలరాజు పెళ్ళాం                            
సుబ్బన్నతో సయ్యాట
సుబ్బిగాడి పెళ్ళమేమో
నాగన్నతో కాట్లాట
నాయుడుగారి తోటలోన
తొక్కుడు బిళ్ళాలాట...'
అంటూ సాగే కోరస్... 'మొన్నేమో అది జరిగింది నిన్నేమో ఇది జరిగింది' డైలాగ్ వింటే.... పల్లెటూరు వీధుల్లో, పొలం గట్లలో ఫలానా విధంగా జరిగిందంటూ ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ కథలను పాటగా మలిచారని అర్థం చేసుకోవచ్చు. ఆ పాటను కింద ఉన్న యూట్యూబ్ లింక్ లో చూడండి!


Also Read : సంక్రాంతి బరిలో మామా అల్లుళ్ళ మధ్య పోటీనా? మాజీ భార్య భర్తల మధ్య పోటీనా?



'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం' తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా 'మంగళవారం'. 'ఆర్ఎక్స్ 100' తర్వాత మరోసారి ఆయన దర్శకత్వంలో పాయల్ రాజ్‌ పుత్ నటించిన సినిమా కూడా ఇదే. అందులో ఆమెకు జోడీగా 'రంగం' ఫేమ్ అజ్మల్ అమీర్ నటించారు. నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి అజయ్ భూపతి 'A' క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామి. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తోంది.  


Also Read అర్థం చేసుకోండి... బాలీవుడ్ సింగర్‌తో మృణాల్ ఠాకూర్ లవ్ ఎఫైర్!?



ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: 'విరూపాక్ష', 'కాంతార' సినిమాల ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్, కూర్పు: మాధవ్ కుమార్ గుళ్ళపల్లి, మాటలు: తాజుద్దీన్ సయ్యద్, రాఘవ్, కళా దర్శకత్వం : మోహన్ తాళ్లూరి, సౌండ్ డిజైనర్ & ఆడియోగ్రఫీ : 'నేషనల్ అవార్డ్ విన్నర్' రాజా కృష్ణన్, నిర్మాతలు: స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : అజయ్ భూపతి.