Manchu Vishnu Announced Kannappa Teaser Launch Date: చాలా గ్యాప్‌ తర్వాత హీరో మంచు విష్ణు నటిస్తున్న చిత్రం 'కన్నప్ప'(Kannappa Movie). అతడి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైథలాజికల్‌ డ్రామా వస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందుతుంది. ఇప్పటికే కన్నప్పపై థీమ్‌పై ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాను మంచు ఇంటర్నేషనల్‌ లెవల్లో భారీ ఎత్తున్న నిర్మిస్తున్నాడు.


ఈ సినిమా కోసం ఏకంగా విదేశీ సాంకేతిక నిపుణులే రంగంలోకి దింపారు. భారీ ఎత్తున్న ఈ నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్‌ ఇండియాగా తీసుకురాబోతున్నారు. ఇక కన్నప్పలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌ కాస్ట్‌ భాగం అవుతుంది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌కుమార్‌, మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్, పద్మశ్రీ పురస్కార గ్రహీత - లెజెండరీ నటుడు - కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, శరత్ కుమార్, మధుబాల, కాజల్‌ అగర్వాల్‌ వంటి భారీ తారగణం కన్నప్పలో కీలక పాత్రలు పోషిస్తున్నాయి. 


ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కొక్కొ అప్‌డేట్‌ మూవీపై అంచనాలు పెంచేస్తోంది. ఇక ఇప్పటికే టీజర్‌ను కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించగా దానికి భారీ రెస్పాన్స్‌ వచ్చింది. టీజర్‌ అద్భుతంగా ఉందంటూ ఇంటర్నేషన్‌ వేదికపై ప్రశంసలు వెల్లువెత్తాయి. కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్లో ప్రశంసలు అందుకున్న ఈ టీజర్‌ను చూసేందుకు ఇండియన్‌ ఆడియన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కన్నప్ప టీజర్‌పై తాజాగా మూవీ టీం అప్‌డేట్‌ ఇచ్చింది. ఇండియాలో కన్నప్ప టీజర్‌ రిలీజ్‌ ముహుర్తం ఫిక్స్‌ చేస్తూ మంచు విష్ణు అధికారిక ప్రకటన ఇచ్చాడు.






జూన్‌ 14న కన్నప్ప టీజర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్టు తాజాగా తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడించాడు మంచు విష్ణు. దీంతో టీజర్‌ను చూసేందుకు ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ అంత క్యూరియాసిటీగా ఉన్నామంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఈ సినిమాను స్వయంగా విష్ణు తండ్రి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించడం విశేషం.  మంచు ఫ్యామిలీకి చెందిన అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు (Mohan Babu) ఈ సినిమాకు హిందీలో మహాభారత సిరీస్ తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే అందించగా.. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.