Manchu Vishnu: టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నటుడు మోహన్ బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన బాటలో తన ఇద్దరి కొడుకులు విష్ణు, మనోజ్ లు కూడా సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా సెటిల్ అయ్యారు. కూతురు మంచు లక్ష్మీ కూడా సినిమాల్లో నటిస్తూ సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీ ట్రోలింగ్ కు గురవుతుంది. వారి కుటుంబంలో ఏం జరిగినా ఇట్టే వైరల్ అయిపోతోంది. మొన్నటి వరకూ మంచు బ్రదర్స్ కు పొసగడంలేదనే వార్తలు వచ్చాయి. అయితే వాటిపై మోహన్ బాబు క్లారిటీ కూడా ఇస్తూ వచ్చారు. ఈ మధ్య మంచు విష్ణు తన సోదరుడు మనోజ్ పై గొడవకు దిగిన వీడియో ఒకటి హల్చల్ చేసింది. అయితే దీనిపై కూడా మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. తాజాగా మంచు ఫ్యామిలీకు సంబంధించి మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల మార్చి 19 న మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయనకు అందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే మంచు విష్ణు మాత్రం తన తండ్రికి ఊహించని గిఫ్ట్ ఇచ్చారట. ఖరీదైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌యూవీ కారుని విష్ణు బహుమతిగా ఇచ్చాడట. ఈ కారు ఖరీదు దాదాపు రూ.5.25 కోట్లు అని తెలుస్తోంది. అయితే ఈ కారు గురించి కానీ దాని ధర గురించి కానీ మంచు ఫ్యామిలీ ఎక్కడా బయటకు చెప్పలేదట. ఇప్పటికే మోహన్ బాబు వద్ద ఆడి క్యూ7, రేంజ్ రోవర్ వోగ్, టయోటా ఫార్చ్యూనర్ కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి కొత్త కారు వచ్చి చేరింది. అయితే ఆయన పుట్టిన రోజు జరిగిన చాలా రోజుల తర్వాత ఈ వార్త బయటకు వచ్చింది. నిజంగా మంచు విష్ణు తన తండ్రికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చారా లేదా ఇదంతా పుకార్లు మాత్రమేనా అనేది తెలియాలి అంటే ఈ వార్తలపై మంచు ఫ్యామిలీ స్పందించాలని అంటున్నారు నెటిజన్స్.
కాగా, ప్రస్తుతం మోహన్ బాబు కూడా వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన రీసెంట్ గా గుణశేఖర్ దర్వకత్వంలో తెరకెక్కిన ‘శాకుంతలం’ సినిమాలో నటించారు. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో నడుస్తుంది. ఈ మూవీ తో పాటు ఇటీవల మంచు విష్ణు ప్రకటించిన ‘హౌస్ ఆఫ్ మంచు’ అనే రియాల్టీ షోను ప్రారంభించాలని చూస్తున్నారు మంచు ఫ్యామిలీ. దీనిపై ఇప్పటికే ఓ అభిప్రాయనికి వచ్చారట. ఇంకో ట్విస్ట్ ఎంటంటే ఇటీవల జరిగిన విష్ణు, మనోజ్ గొడవ కూడా ఈ ‘హౌస్ ఆఫ్ మంచు’లో భాగమేనని అంటున్నారు. మరి ఈ రియాలిటీ షోతో మంచు ఫ్యామిలీ ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ ఇస్తుందో చూడాలి.
Also Read : 'శాకుంతలం' రివ్యూ : సమంత సరిగా చేయలేదా? గుణశేఖర్ బాగా తీయలేదా?