కలెక్షన్ కింగ్, డాక్టర్ మంచు మోహన్ బాబు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కుమారుడు, తెలుగు ప్రేక్షకులకు, చిత్రసీమ ప్రముఖులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని మంచు మనోజ్ (Manchu Manoj) రెండో పెళ్లి ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్ఫై నిమిషాలకు జరగనుంది. 


గురువారం రాత్రి సంగీత్...
ఫోటోలు షేర్ చేసిన లక్ష్మీ మంచు!
హైదరాబాదులోని జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్ లో మోహన్ బాబు ఇల్లు ప్రేక్షకులకూ తెలుసు. ఇప్పుడు ఆ ఇంటిని లక్ష్మీ మంచుకు రాసి ఇచ్చినట్లు వినికిడి. అందులో లక్ష్మీతో పాటు మనోజ్ ఉంటున్నారు. ఆ ఇంటిలోనే పెళ్లికి ఏర్పాట్లు చేశారు. గురువారం సంగీత్ వేడుక జరిగినట్లు తెలిసింది. మెహందీ ఫోటోలను సోషల్ మీడియాలో లక్ష్మీ మంచు షేర్ చేశారు. తమ్ముడి పెళ్లి పనులు అన్నిటినీ ఆమె దగ్గర ఉండి చూసుకుంటున్నారని సమాచారం. ఈ వివాహానికి అతికొద్ది మంది బంధు మిత్రులను మాత్రమే ఆహ్వానించారట. 


భూమా మౌనిక రెడ్డితో జంటగా తిరిగిన మనోజ్
మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ తొలి వారంలో భాగ్య నగరంలోని సీతాఫల్ మండిలోని వినాయక మండపంలో జంటగా కనిపించారు. ఆ సమయంలో  గణనాథుడికి పూజలు చేశారు. అప్పుడే ప్రేమ విషయం బయటకు వచ్చింది. అప్పుడు పెళ్లి గురించి ప్రశ్నించగా... అది తన వ్యక్తిగత విషయం అని చెప్పారు. ఆ తర్వాత డిసెంబర్ నెలలో కడప దర్గాను మనోజ్ సందర్శించారు. అక్కడ కొత్త జీవితం ప్రారంభించనున్నట్టు, త్వరలో కొత్త కుటుంబంతో కడప దర్గాకు మళ్ళీ రావాలని ఉన్నట్టు ఆయన తెలిపారు. అప్పుడు మనోజ్, భూమిక పెళ్లి చేసుకుంటారనే స్పష్టత వచ్చింది. 


ఎవరీ భూమా మౌనిక?
రాయలసీమలో బలమైన రాజకీయ నేపథ్యం కల భూమా నాగి రెడ్డి, శోభా రెడ్డి దంపతుల రెండో కుమార్తె నాగ మౌనిక. తల్లిదండ్రుల మరణం తర్వాత పిల్లలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాగి రెడ్డి, శోభా రెడ్డిల మొదటి కుమార్తె అఖిల ప్రియ రాజకీయాల్లోకి రాగా... కష్టకాలంలో అక్కకు అండగా నిలిబడుతూ, తమ నియోజకవర్గంలో కార్యకర్తలతో నిత్యం మౌనిక టచ్ లో ఉంటున్నారు. ఆమెకు కూడా ఇది రెండో పెళ్లి.
హీరోగా మంచు మనోజ్ ప్రయాణమే కాదు, ఆయన వ్యక్తిగత జీవితం కూడా రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పాలి. ఎందుకు అంటే... మొదటి పెళ్లి ఆయనకు కలిసి రాలేదు. గతంలో ప్రణతి రెడ్డిని మనోజ్ ప్రేమించారు. వాళ్ళిద్దరూ 2015లో పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆ వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. తమ దారులు వేర్వేరు అంటూ 2019లో విడిపోయారు. విడాకుల తర్వాత చాలా రోజులు మనోజ్ ఒంటరిగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం రాయలసీమకు చెందిన బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన భౌమ నాగ మౌనికతో ఆయన ప్రేమలో పడ్డారని తెలిసింది. 


Also Read : 'అర్జున్ రెడ్డి' దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా - మెంటల్ మాస్ కాంబినేషన్
  
మనోజ్ తన మొదటి భార్య ప్రణతికి విడాకులు ఇచ్చిన తర్వాత... సినిమాలు కూడా తగ్గించారు. భూమ మౌనికా రెడ్డికి కూడా ఇదివరకే పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె కూడా ఒంటరిగానే ఉంటున్నారు. కష్ట సమయాల్లో మనోజ్, భూమా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే మౌనిక, మనోజ్ మధ్య స్నేహం కుదిరి ఉండొచ్చని టాక్.


Also Read 'బలగం' రివ్యూ : చావు చుట్టూ అల్లిన కథ - 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?