Manamey Movie Review In Telugu: శర్వానంద్ హీరోగా యాక్ట్ చేసిన కొత్త సినిమా 'మనమే' నేడు రిలీజయ్యింది. దీంతో ఆయన కెరీర్లో కొత్త అడుగు పడింది. టైటిల్ కార్డులో ఛార్మింగ్ స్టార్ అని పడింది. హీరోగా శర్వా 35వ సినిమా ఇది. ఇండియాలో కంటే అమెరికా, యూకేలో ప్రీమియర్ షోలు పడ్డాయి. రిలీజుకు ముందు ఇండస్ట్రీ నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. అయితే ప్రీమియర్ షోలు చూసిన పబ్లిక్ నుంచి షాకింగ్ రిపోర్ట్స్ వచ్చాయి.


శర్వానంద్ ఎనర్జీ సూపర్... కామెడీ కేక!
'మనమే'లో ముందుగా అందర్నీ ఎట్ట్రాక్ట్ చేసే పాయింట్ ఏదైనా వుందంటే అది శర్వానంద్ ఎనర్జీ. ఆయన సినిమా అంతటినీ తన భుజాల మీద నడిపించారని, స్టయిలుగా కనిపించడంతో పాటు చాలా చక్కగా సినిమా చేశారని ఎన్నారై ఫ్యాన్స్, ఆడియన్స్ ఫుల్ మార్క్స్ వేశారు. శర్వా టైమింగ్ కారణంగా కామెడీ క్లిక్ అయ్యిందని చెప్పారు.






ఇంటర్వెల్ అయ్యాక ఫెయిల్ అయ్యిన డైరెక్టర్!
శర్వానంద్ యాక్టింగ్ ఫుల్ మార్క్స్ అందుకోగా... డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యకు ఆడియన్స్ నుంచి నెగెటివ్ మార్క్స్ వచ్చాయి. కామెడీతో పాటు ఎమోషన్స్ మిక్స్ చేసి ఫస్ట్ హాఫ్ బాగా చేసిన శ్రీరామ్ ఆదిత్య సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి ఫెయిల్ అయ్యాడని అంటున్నారు. ఎమోషన్స్ అంతగా ఎలివేట్ చెయ్యలేకపోయాడని చెబుతున్నారు.


Also Readపవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా



విలన్ రోల్ చేసిన రాహుల్ రవీంద్రన్
Rahul Ravindran In Manamey: 'మనమే' ఎలా వుంది అని చెప్పేదాని కంటే ముందు ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్ విలన్ రోల్ చేశాడని ఆడియన్స్ చెబుతున్నారు. మూవీలో ఆయన క్యారెక్టర్ వీక్ అంటున్నారు.


Also Read: పెళ్లైతే హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలి, ట్రెండ్ మారింది - 'సత్యభామ' ఇంటర్వ్యూలో కాజల్ సెన్సేషనల్ కామెంట్స్


శర్వానంద్ ఎనర్జీ కారణంగా 'మనమే' పాస్ అయ్యిందని ట్విట్టర్ రిపోర్ట్. ఆయన యాక్టింగ్, హ్యూమర్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్ అని చెబుతున్నారు. కొన్ని ఏరియాల్లో ప్రీమియర్ షోలు అరగంట లేటుగా పడ్డాయట. దాంతో ట్విట్టర్ టాక్ బయటకు రాలేదు. తెలుగు స్టేట్స్ ఆడియన్స్ మార్నింగ్ షోస్, ఇక్కడి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.