anupama parameswaran latest Instagram post goes viral: టిల్లు స్క్వేర్‌ మూవీ తర్వాత అనుపమ పరమేశ్వరన్‌ ఏం చేసిన అది హాట్‌టాపిక్‌ అవుతుంది. ఈ మూవీ వరకు చాలా పద్దతిగా కనిపించిన ఆమె ఈ సినిమాతో బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చింది. ఇందులో హీరో సిద్దు జొన్నలగడ్డతో డీప్‌ లిప్‌లాక్‌ సీన్స్‌లో నటించి షాకిచ్చింది. ఇలా అనపమను చూసి ఫ్యాన్స్‌ అంతా హర్ట్‌ చేశారు. ఒకేసారి ఇంతటి చేంజా? మరింత ఇంత బోల్డ్‌గా నటించాల్సిన అవసరం ఏముందంటూ ఆమెను ట్రోల్‌ చేశారు.


మరోవైపు తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన హాట్‌హాట్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ కుర్రకారుకు కిక్ ఇస్తుంది.  ఈ క్రమంలో సినిమాలో, సోషల్‌ మీడియాలో అనుపమ జోరు చూసి అంతా అవాక్క్‌ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా అనుపమ ఓ ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. తనకు వీపుకు ఇలాంటి మాసాజ్ కావాలంటూ ఓ పోస్ట్‌ షేర్ చేసింది. దీంతో ఇప్పుడంతా అనుపమ పోస్ట్‌పై చర్చించుకుంటున్నారు. ఇంతకి అసలు విషయం ఏంటంటే..  రోడ్‌ రోలర్‌తో ఓ వ్యక్తి వీపుపై నుంచి వెళుతున్నట్టు ఉంది. "ఇప్పుడు నా నడుముకు ఇలాంటి మసాజ్ కావాలి" అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో అనుపమ షేర్‌ చేసిన ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇక తన కామెంట్స్‌ చూసి ఫ్యాన్స్‌ ఆమెకు ఏమైందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


కాగా అనుపమ పరమేశ్వరన్‌ ప్రస్తుతం ఓ లేడీ ఒరియంటెడ్‌ మూవీ చేస్తుంది. అదే 'పరదా'. అలాగే 'హనుమాన్'‌ డైరెక్టర్‌ దర్శకత్వంలో అక్టోపస్‌ అనే చిత్రం కూడా చేస్తుంది. అయితే ప్రస్తుతం పరదా మూవీ షూటింగ్‌తో బిజీ ఉంది. లేడీ ఒరియంటెడ్‌గా వస్తున్న ఈ చిత్రానికి 'సినిమా బండి' ఫేం ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకులు ముందు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే అనుపమ ఈ మూవీ షూటింగ్‌తో శారీరకంగా అలసిపోతుందట. ఈ క్రమంలో అనుపమ ఈ పోస్ట్‌ చేసి ఉంటుందని అంటున్నారు. 


ప్రేమమ్‌ సినిమాతో తమిళ పరిశ్రమలో నటిగా సినీరంగ ప్రవేశం చేసిన అనుపమ తన నటనతో మంచి గుర్తింపు పొందింది. ఆ వెంటనే కోలీవుడ్‌లో మరో సినిమా చేసింది. అదే టైంలో త్రివిక్రమ్‌ కంట పడ్డ అనుపమ ఆయన దర్శకత్వంలో వచ్చిన'అఆ'సినిమాలో కీ రోల్‌ పోషించింది. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది.  ఆ తర్వాత నాగ చైతన్య 'ప్రేమమ్'లో హీరోయిన్‌గా నటించింది. అప్పటి నుంచి 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమకోసమే', 'కృష్ణార్జున యుద్ధం' వంటి పలు చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ ఆఫర్స్‌ అందుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఇక్కడ మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత పెద్దగా ఆఫర్స్‌ లేకపోయిన ఆడపదడప చిత్రాలు చేస్తూ కెరీర్‌లో ముందుకు వెళుతుంది. ఈ క్రమంలో రీసెంట్‌గా టిల్లు స్వ్కేర్‌లో తన మార్కు పూర్తి భిన్నమైన పాత్ర ఎంచుకుంది. లిల్లి అనే నెగిటివ్‌ అండ్‌ బోల్డ్‌ క్యారెక్టర్‌ చేసి అందరికి షాకిచ్చింది. ఇందులో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో అనపమ కెరీర్‌ మళ్లీ జోరందుకుంది.