NTR Joins The Shooting Set In NTRNeel Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్టుపై సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.

Continues below advertisement


ఆ రోజు నుంచి ఎన్టీఆర్


ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ షూటింగ్ సెట్‌లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ 'వార్ 2' షూటింగ్ ఇటీవలే పూర్తైంది. ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'వార్ 2' సినిమా తర్వాత పలు ఈవెంట్లకు హాజరైన ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' మూవీ షూటింగ్‌లో జాయిన్ అవుతున్నారు. దీంతో మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ షురూ అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.


రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్‌కతా బ్యాక్ డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్ సిద్ధం చేసి అక్కడ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ నిర్వహించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్ నటించనున్నారు. యువ హీరో టొవినో థామస్ కీలక పాత్రలో కనిపించనున్నారు.


Also Read: నాలుగైదు రోజులు 'సారంగపాణి' గురించి మాట్లాడుకుంటారు - ప్రతీ రోల్ కొత్తగానే ఉంటుందన్న దర్శకుడు ఇంద్రగంటి


ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో తారక్ మునుపెన్నడూ లేని మాస్ పాత్రలో డిఫరెంట్ లుక్‌తో కనిపించనున్నారు.  ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. రవి బ్రసూర్ సంగీతం అందిస్తున్నారు.


యునిక్ స్క్రిప్ట్.. స్టోరీ అదేనా..?


కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ సినిమాలు తెరకెక్కించిన ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. ఇదివరకూ ఎన్నడూ లేని విధంగా ఓ డిఫరెంట్ లుక్‌లో ఫుల్ మాస్‌తో ఎన్టీఆర్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్టోరీపై పలు రూమర్లు వినిపిస్తున్నాయి. సినిమాపై సోషల్ మీడియాలో ఎలాంటి చిన్న అప్ డేట్ వచ్చినా క్షణాల్లోనే ట్రెండ్ అవుతోంది.


ఈ సినిమా థాయ్‌లాండ్, మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్న గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాన్ని పాలించే ప్రసిద్ధ చైనీస్ గ్యాంగ్ స్టర్, మాఫియా డాన్ 'జావో వీ' నిజ జీవిత పాత్ర నుంచి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. మాఫియా డాన్ రోల్‌లో ఎన్టీఆర్ కనిపించనున్నట్లు సమాచారం. దిగువ స్థాయి నుంచి ఎదిగి ఇద్దరు గ్యాంగ్ స్టర్స్‌తో పోరాడి తన సొంతంగా ఎదిగి తిరుగులేని నాయకుడిగా అవతరిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఇదే కథ అంటూ ఓ ఆంగ్ల మీడియా రిపోర్ట్ వెల్లడించింది. ఇప్పటివరకూ ఇండియన్ సినిమాలో చూడని యునిక్ స్క్రిప్ట్ అని అంటూ నిర్మాత రవిశంకర్ ఇటీవల చేసిన కామెంట్స్ మూవీకి మరింత హైప్ ఇచ్చాయి.