యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులకు ఓ గుడ్ న్యూస్. శ్రీరామ నవమి సందర్భంగా ఆయన అభిమానులకు NTR 30 యూనిట్ ఓ కొత్త అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో... దర్శక ధీరుడు రాజమౌళి క్లాప్‌తో ఆ సినిమాను ప్రారంభించారు. మరి, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అంటే...
శుక్రవారం నుంచి షూటింగ్ మొదలు
NTR 30 Regular Shoot Update : శుక్రవారం... అనగా ఈ నెల 31 నుంచి ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నామని చిత్ర బృందం ఓ అప్డేట్ ఇచ్చింది. ఎన్టీఆర్ కూడా షూటింగులో జాయిన్ కానున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు లొకేషన్ పిక్స్ కొన్ని లీక్ అయ్యాయి. బ్లడ్ ట్యాంకర్స్ ఫోటోలు బయటకు వచ్చాయి. వాటిని పక్కన పెడితే... ఈ సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ అండ్ నిర్మాతలు ఇంటర్నేషనల్ టెక్నీషియన్లను తీసుకు వచ్చారు.
Also Read : బన్నీ, చెర్రీ మధ్య స్టార్ వార్ - ఒక్క పోస్ట్‌తో ఆ వార్తలకు చెక్ పెట్టిన అల్లు అర్జున్ భార్య
ఎన్టీఆర్ 30కి బ్రాడ్ మినించ్ వీఎఫ్ఎక్స్!
ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ను తీసుకు వచ్చారు. 'ఆక్వా మాన్', 'జస్టిస్ లీగ్', 'బ్రాడ్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్' సినిమాలకు వర్క్ చేసిన బ్రాడ్ మైనించ్ NTR 30లో కొన్ని కీలకమైన సన్నివేశాలకు వీఎఫ్ఎక్స్ సూపర్ విజన్ చేస్తారని నిర్మాతలు తెలిపారు.
నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థపై కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె NTR 30 Movie ని నిర్మిస్తున్నారు. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత తెలుగులో ఆయన సంగీతం అందిస్తున్న చిత్రమిది. ఇందులో ఎన్టీఆర్ జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా సందడి చేయనున్నారు.
ఎన్టీఆర్ సినిమాకు కెన్నీ బేట్స్!
హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన 'మిషన్ ఇంపాజిబుల్', 'ట్రాన్స్‌ఫార్మర్స్', 'రాంబో 3' తదితర హాలీవుడ్ సినిమాలకు పని చేసిన స్టంట్ డైరెక్టర్ కెన్నీ బాట్స్ (Kenny Bates) ఎన్టీఆర్ 30 సినిమాకు పని చేయనున్నారు. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' సినిమాకు కూడా ఆయన పని చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల, సినిమాటోగ్రాఫర్ రత్నవేలుతో కెన్నీ బేట్స్ డిస్కస్ చేస్తున్న ఫోటో విడుదల చేశారు. అది చూస్తే... షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ అని తెలుస్తుంది. సినిమాలో మెజారిటీ ఫైట్స్ ఆయనే చేస్తారని ఎన్టీఆర్ 30 బృందం తెలిపింది. మృగాలు వంటి మనుషులను భయపెట్టే మగాడిగా, చాలా శక్తివంతంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంటుందని కొరటాల శివ చెప్పేశారు. ఎన్టీఆర్ తనకు సోదరుడు లాంటి వాడు అని, ఆయనతో రెండోసారి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
Also Read : బోయపాటి సినిమాలో భారీ బుల్ ఫైట్ - ఇరగదీసిన రామ్