ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి (Writer Malladi Venkata Krishna Murthy) నవలలు లేదా కథలు లేదా వ్యాసాలు చదవని తెలుగు ప్రజలు ఉండరు. తరాలుగా తరగని అభిమానం ఆయన సొంతం. ప్రజలతో తన రచనల్ని చదివించారు మల్లాది. ఆ రచనల్లో తన ఆలోచనల్ని చూపించారు. రాతలో 55 ఏళ్ల అనుభవం ఉన్న దిగ్గజ రచయిత ఆయన. అయితే... ఏనాడూ తన రూపాన్ని మీడియాకు చూపించలేదు. అటువంటి మల్లాది తొలిసారి ఒక పుస్తకం గురించి మాట్లాడారు. ఆ ఘనత అందుకున్న, ఆయన్ను మెప్పించిన బుక్ 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్'. 


హిచ్‌కాక్... ముందుమాట రాసిన మల్లాది
సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ - ఐఆర్ఎస్ అధికారి రవి పాడి సంపాదకత్వంలో వచ్చిన పుస్తకం 'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్'. ఇందులో 45 మంది దర్శకులతో పాటు ఏడుగురు రచయితలు, పది మంది జర్నలిస్టులు రాసిన 62 వ్యాసాలున్నాయి. ఇటీవల సీనియర్ దర్శకులు వంశీ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని హరీష్ శంకర్‌కు అందజేశారు. రెండు వారాల క్రితం బుక్ లాంచ్ చేయగా... ఆల్రెడీ అన్నీ కాపీలు అమ్ముడు అయ్యాయి. ఇప్పుడు రెండో ఎడిషన్ ప్రింటింగ్ కోసం రెడీ అవుతున్న ఈ పుస్తకానికి మల్లాది వెంకట కృష్ణమూర్తి ముందు మాట రాశారు. అంతే కాదు... పుస్తకాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రశంసా పూర్వకమైన ఆడియో విడుదల చేశారు.


Also Readట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య... 'గేమ్ ఛేంజర్' టీంకు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్






నేనూ ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఫ్యాన్ - మల్లాది
'మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్' పుస్తకం గురించి మల్లాది మాట్లాడుతూ... ''ఇంగ్లీష్ సినిమాలు చూసే వారికి, చూడని వారికీ హాలీవుడ్ దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ తెలుసు. ఆయన ఎక్కువగా క్రైమ్, మిస్టరీ, సస్పెన్స్ డ్రామాలు తీశారు. తన పేరును ఒక బ్రాండ్‌గా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. 'సైకో' విడుదల తర్వాత అందులోని బాత్ టబ్ మర్డర్ సీన్ చూసి తన భార్య స్నానం చేయడం మానేసిందని ఒక భర్త నుంచి లేఖ వేస్తే... ఆవిడను లాండ్రీకి పంపించమని సలహా ఇచ్చారు హిచ్‌కాక్. ఆతృతగా ఎదురు చూడటంలోనే ఉత్కంఠ ఉంటుందని సస్పెన్స్ గురించి హిచ్‌కాక్ చెప్పింది అక్షరాలా సత్యం. ఆయన గురించి ఎన్నో విశేషాలతో స్నేహితులు పులగం చిన్నారాయణ (Pulagam Chinnarayana), రవి పాడి పుస్తకం తీసుకువచ్చారు. తొలి ఎడిషన్ రెండు వారాల్లో అమ్ముడు కావడం హిచ్‌కాక్ మీద తెలుగు ప్రజలకు ఉన్న అభిమానానికి నిదర్శనం. ఈ సందర్భంగా పులగం చిన్నారాయణ, రవి పాడికి నా కంగ్రాచ్యులేషన్స్. ఇందులో ముందుమాట రాసే అవకాశం రాకపోతే నేనూ హిచ్‌కాక్ అభిమానిని అని తెలియజేసే అవకాశం ఉండేది కాదు'' అని చెప్పారు.


Also Readలైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్