ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించిన ఇండస్ట్రీలలో మాలీవుడ్ ముందంజలో ఉంది. ఈ ఏడాది అక్కడ రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాల పరంగా టాప్ లో ఉన్నప్పటికీ, 2024 లో మాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన సినిమాలు అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఒకసారి ఈ ఏడాది మొత్తం మాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ పనితీరును విశ్లేషిస్తే, దాదాపు నెలకు ఒక్క హిట్ అన్న పడింది.


ఏడాది మొదట్లోనే గుడ్ న్యూస్ 


దర్శకుడు ఆనంద్ 'ఎకర్షి' సినిమాతో 2024 ప్రారంభమైంది. నిజానికి ఈ మూవీ 2023లోనే రిలీజ్ అయింది. అయితే 'ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ కేరళ'లో విమర్శకులు ప్రశంసలు అందుకున్న తర్వాత 2024 జనవరిలో మళ్లీ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఉత్తమ చలన చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత మలయాళ క్రైం థ్రిల్లర్ 'అబ్రహం ఓజ్లర్' మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. అలాగే ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో స్ట్రిమింగ్ అవుతున్న పోలీస్ డ్రామా 'అన్వేషిప్పిన్ కండెతుమ్' కూడా మంచి ప్రేక్షకాదరణను దక్కించుకుంది.


2024లో మలయాళ సినిమాను అగ్రస్థానంలో ఉంచిన అద్భుతమైన సినిమాలలో 'ప్రేమలు' ఒకటి. గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ లైట్ హార్టెడ్ రొమాంటిక్ మూవీ ఫిబ్రవరిలో రిలీజై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'ప్రేమలు' తర్వాత మమ్ముట్టి హీరోగా నటించిన 'భ్రమ యుగం' మూవీ థియేటర్లలో ప్రేక్షకులను భలేగా భయపెట్టింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించగా, బ్లాక్ అండ్ వైట్ లో వచ్చినప్పటికీ ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చిదని. ఇక ఫిబ్రవరిలో వచ్చిన మరో బెస్ట్ మూవీ 'మంజుమ్మెల్ బాయ్స్'. 2024లో అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన మూవీగా నిలిచింది 'మంజుమ్మెల్ బాయ్స్'. 


మార్చిలో థియేటర్లలోకి వచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్ 'ఆడు జీవితం' మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది. కానీ ఈ సినిమాకి రెహమాన్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచింది. హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్ లో బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అవార్డును సొంతం చేసుకుంది. ఏప్రిల్ లో ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన 'ఆవేశం' మూవీ రిలీజై, ఈ ఏడాది మాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. దీనికి ప్రణవ్ మోహన్‌లాల్, శ్యాన్ శ్రీనివాసన్ ల మూవీ 'వర్షాంగళక్కు శేషం' తోడైంది. అలాగే జూన్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ -  బాసిల్ జోసెఫ్‌ల 'గురువాయూర్ అంబలనాడయిల్' మూవీ మంచి ఫ్యామిలీ ట్రీట్ అయ్యింది. అలాగే 'గోలం' మూవీ కూడా అదరగొట్టింది. జూన్లోనే వచ్చిన మరో హిట్ మూవీ పార్వతి తిరువోతు, ఊర్వశి నటించిన 'ఉల్లోజుక్కు' రిలీజ్ అయింది. ఈ మూవీ అంతర్జాతీయ మూవీ ఫెస్టివల్స్ లో ప్రతిష్టాత్మకమైన అవార్డులను సొంతం చేసుకుంది.


Also Read: ఇయర్ ఎండ్ రివ్యూ: బాలీవుడ్‌లో ఈ ఏడాది బెస్ట్ విలన్లు... మోస్ట్ డేంజరస్ యూటర్న్ తీసుకున్న హీరోలు వీళ్ళే


ద్వితీయార్థంలోనూ తగ్గని జోరు 
 
జూలై నెలలో రిలీజ్ అయిన లెవెల్ క్రాస్, వాజా, నునాకుజి సినిమాలు 2024 ద్వితీయార్థంలోనూ మలయాళ సినిమా పరిశ్రమ హిట్ల జోరును కొనసాగించాయి. ఇక సెప్టెంబర్ లో 'కిష్కింద కాండం',  మలయాళీ తారాగణం నటించిన 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' అనే సినిమా 77వ కేమ్స్ ఫిలిం ఫెస్టివల్ లో 'గ్రాండ్ ప్రిక్స్' అవార్డును గెలుచుకొని భారతదేశాన్ని గర్వించేలా చేసింది. నవంబర్లో చూసుకుంటే 'సూక్ష్మదర్శిని', డిసెంబర్‌లో 'రైఫిల్ క్లబ్', 'మార్కో' వంటి సినిమాలు ఆకట్టుకున్నాయి. అయితే అన్ని ఇండస్ట్రీలోలాగే మలయాళం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బోల్తా పడితే, చిన్న సినిమాలు మాత్రం దుమ్ము రేపాయి. 


Read Also: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే