మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం కొత్త దర్శకులతో వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బింబిసార డైరెక్టర్ వశిష్టతో 'విశ్వంభర' మూవీకి కమిట్ అయిన ఆయన, రీసెంట్ గా శ్రీకాంత్ ఓదెలతో సినిమాను ప్రకటించి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఫస్ట్ మూవీ ' దసరా 'తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు తన సెకండ్ మూవీని నానితో చేస్తున్నారు. 'ది పారడైజ్' అనే ఈ మూవీ పూర్తయ్యాక ఓదెల - చిరు ప్రాజెక్ట్ షురూ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి - ఓదెల కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ ఉండదని, పాటలు కూడా ఉండే అవకాశం లేదని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రొడ్యూసర్ స్పందిస్తూ ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చారు.


చిరు- ఓదెల సినిమాలో పాటల్లేవు


డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు పెద్దగా అనుభవం లేకపోయినా, ఆయన తీసిన 'దసరా' సినిమా అద్భుతంగా ఉండడంతో... ఈ యువ దర్శకుడి టాలెంట్ ని నమ్మి చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు. ఇక ఈ మూవీ వయలెంట్ గా ఉండబోతుందని ఇప్పటికే వెల్లడించారు. అందుకే చిరు - ఓదెల ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. పైగా ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ తో కలిసి నాని నిర్మించబోతున్నారు. తాజాగా ఎస్ఎల్వీ సినిమాస్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మెగా 156 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ ఒక పీరియాడిక్ డ్రామా అని ఆయన చెప్పారు. అయితే ఈ మూవీలో అసలు హీరోయిన్ ఉండదని, పాటలు కూడా ఉండబోవని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో వాటి గురించి మాట్లాడుతూ నిర్మాత సుధాకర్ చెరుకూరి క్లారిటీ ఇచ్చారు. "సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టుగా ఈ సినిమాలో పాటలు లేవు అనేది ఆ వాస్తవం. సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్లను ఇప్పటికే ఫిక్స్ చేసాము. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది" అని వెల్లడించారు. దీంతో ఇప్పటిదాకా 'చిరు 156' మూవీ గురించి జరిగిన ఫేక్ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్టుగా అయ్యింది.


Also Read: ట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య... 'గేమ్ ఛేంజర్' టీంకు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్


ఒకే జానర్ లో చిరు, నాని సినిమాలు...


మెగా 156 మూవీ పీరియాడిక్ జానర్ లో రూపొందబోతోందని  నిర్మాత సుధాకర్ చెరుకూరి చెప్పుకొచ్చారు. అయితే నాని మూవీ కూడా సేమ్ జానర్ లో రాబోతుందని ఆయనే స్పష్టం చేశారు. మరి ఒకే జానర్ లో ఇద్దరు హీరోలతో రెండు సినిమాలు అంటే ఓదెల ఏం ప్లాన్ చేస్తున్నాడో చూడాలనే ఆసక్తి పెరిగిపోయింది మూవీ లవర్స్ లో. ఇక నాని సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తి కాగానే, నెక్స్ట్ చిరు మూవీ షూటింగ్ ను ఓదెల మొదలు పెట్టబోతున్నారని ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ వెల్లడించారు. 


Also Readలైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు - అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్