2024 చివరకు వచ్చేసింది. ఈ ఏడాది థియేటర్లలో ఎక్కువగా సీక్వెల్స్ హవా నడిచింది. సౌత్ నుంచి నార్త్ దాకా బాక్స్ ఆఫీసు దగ్గర పలు సీక్వెల్స్ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కొన్ని పాన్ ఇండియా సినిమాలు నిరాశ పరిచినప్పటికీ, మరికొన్ని సినిమాలు మాత్రం రికార్డులను తిరగ రాశాయి. ముఖ్యంగా 'పుష్ప 2' ఫీవర్ మామూలుగా లేదు. ఏకంగా 1500 కోట్లను కొల్లగొట్టి చరిత్రను తిరగరాసింది. ఈ ఏడాది రిలీజైన సీక్వెల్స్ మాత్రం కలెక్షన్స్ పరంగా అదరగొట్టడంతో పాటు, ప్రేక్షకుల మనసును కూడా దోచుకున్నాయి.  


పుష్ప 2 : ది రూల్ 
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2'. బ్లాక్ బస్టర్ మూవీ 'పుష్ప'కు సీక్వెల్ గా తెరకెక్కిన 'పుష్ప 2' డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుని, భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 1508 కోట్ల గ్రాస్ వసూలు చేసి, అత్యంత వేగంగా ఈ ఫీట్ ను సాధించిన సినిమాగా 'పుష్ప 2' రికార్డులకెక్కింది. సౌత్ నుంచి నార్త్ దాకా ఈ సినిమా ఫీవరే నడుస్తోంది ఇప్పుడు. 


స్త్రీ 2
రాజ్‌ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన 2018 సూపర్‌ హిట్‌ మూవీ 'స్త్రీ'. దీనికి సీక్వెల్ గా వచ్చిన సినిమా 'స్త్రీ 2'. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అపరశక్తి ఖురానా, పంకజ్ త్రిపాఠి, తమన్నా, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటించారు.


భూల్ భూలయ్యా 3 
ఈ సినిమా గురించి మాట్లాడుకోకపోతే 2024 బాలీవుడ్ సీక్వెల్‌ల జాబితా అసంపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనీజ్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మూవీ లవర్స్ ను తెగ ఆకట్టుకుంది. కార్తిక్ ఆర్యన్, విద్యా బాలన్, మాధురీ దీక్షిత్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.  


సింగం అగైన్ 
రోహిత్‌ శెట్టి , అజయ్‌ దేవగన్‌ కాంబినేషన్ వచ్చిన సినిమా 'సింగం ఎగైన్'. ఈ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో అర్జున్ కపూర్ విలన్ గా నటించారు. అతనితో పాటు సూర్యవంశీగా అక్షయ్ కుమార్, సంగ్రామ్ భలేరావ్ పాత్రలో రణ్వీర్ సింగ్ అతిథి పాత్రల్లో నటించి అదరగొట్టారు.


డూన్ 2
ఇక ఈ ఏడాది హాలీవుడ్ సీక్వెల్స్ కూడా అదరగొట్టాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 'డూన్ 2' గురించే. ఈ చిత్రంలో తిమోతీ చలమెట్, జెండయా, ఆస్టిన్ బట్లర్ కీలక పాత్రల్లో నటించారు. 'డూన్ 2' సినిమా ఇండియాలో కలెక్షన్ల పరంగా అదరగొట్టింది.


Also Read: రోడ్ షో చేయలేదు... పోలీసులు నా దగ్గరకొచ్చి చెప్పలేదు... నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు - రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అల్లు అర్జున్ రియాక్షన్


ఇన్‌సైడ్ అవుట్ 2
భావోద్వేగాలకు సంబంధించిన అద్భుతమైన యానిమేషన్ సినిమాలలో ఇన్‌సైడ్ అవుట్ 2' కూడా ఒకటి. ఈ సంవత్సరంలో అతిపెద్ద హిట్ సీక్వెల్‌లలో ఇది కూడా ఒకటిగా నిలిచింది 'ఇన్‌సైడ్ అవుట్ 2'. 


డెడ్‌పూల్ & వుల్వరైన్
ర్యాన్ రెనాల్డ్స్, హ్యూ జాక్‌మన్ ముఖాముఖి పోరాడిన 'డెడ్‌పూల్ & వుల్వరైన్' సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్‌మన్ మధ్య జరిగిన సరదా ఫైట్ హాలీవుడ్ మూవీ లవర్స్ ను తెగ ఆకట్టుకుంది. వీటితో పాటు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత 'గ్లాడియేటర్ 2' తెరపైకి వచ్చింది. ఈ సినిమాతో పాటు 'జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్' కూడా రిలీజ్ అయ్యింది.


Also Readటాలీవుడ్ మీద 'పుష్ప 2' ఎఫెక్ట్... ఇకపై బెనిఫిట్ షోలు ల్లేవ్ - టికెట్ రేట్లూ పెరగవ్