గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా 'గేమ్ చేంజర్' (Game Changer). శంకర్ డైరెక్షన్ చేశారు. ఇప్పుడు వాళ్లిద్దరూ డల్లాస్ (Dallas)లో ఉన్నారు. వాళ్లతో పాటు ఇంకొందరు కూడా! 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వెళ్లారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసా?


ఫస్ట్ టైమ్ డల్లాస్, అమెరికాలో ఈవెంట్
Game Changer Pre Release Event: సాధారణంగా సినిమా రిలీజ్ తర్వాత హీరో అండ్ టీమ్ అమెరికా వెళ్లడం కామన్. ఈ మధ్య కొంత మంది సెలబ్రిటీలు రిలీజ్ ముందు కూడా వెళ్తున్నారు. కానీ, ఫర్ ద ఫస్ట్ టైమ్... అమెరికాలోని డల్లాస్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 'గేమ్ చేంజర్'తో అమెరికాలో తెలుగు మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సంస్కృతి మొదలైందని చెప్పవచ్చు. 


'గేమ్ చేంజర్' ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఎవరు?
'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చిత్ర బృందం అమెరికా వెళ్ళింది. వాళ్ళతో పాటు క్రియేటివ్ జీనియస్ సుకుమార్ వెళ్లారు. ఆయనతో పాటు రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం సినిమా (పెద్ది) తెరకెక్కిస్తున్న దర్శకుడు బుచ్చి బాబు సానా కూడా వెళ్లారు. ఈ ఈవెంట్ చీఫ్ గెస్ట్ సుకుమార్ అయితే... మరొక గెస్ట్ బుచ్చి అన్నమాట.


'గేమ్ చేంజర్' అమెరికా డిస్ట్రిబ్యూటర్ రాజేష్ కల్లేపల్లి భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. యాంకర్ సుమను ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా అమెరికా తీసుకు వెళ్లడం విశేషం. శంకర్ వెంట ఆయన కుమార్తెలు సైతం వెళ్లారు. ఇంకా నిర్మాత శిరీష్ ఉన్నారు. రామ్ చరణ్ రాకతో డల్లాస్ సిటీ అంతా హోరెత్తుతోందని అక్కడి తెలుగు ప్రజలు చెబుతున్నారు. ఆల్రెడీ మెగా ఫ్యాన్స్, ప్రేక్షకులతో చరణ్ సమావేశం అయ్యారు. సోషల్ మీడియా అంతా ఇప్పుడు ఈ సినిమా టాపిక్కే.  


డల్లాస్ సిటీలో డిసెంబర్ 21వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం అవుతుంది. అంటే... ఇండియన్ టైమింగ్ ప్రకారం డిసెంబర్ 22 (ఆదివారం) ఉదయం ఐదున్నర గంటల సమయంలో అన్నమాట. రామ్ చరణ్ ఎంట్రీ అండ్ స్పీచ్ భారతీయ కాలమానం ప్రకారం ఎనిమిది గంటలకు ఉండవచ్చు.


Also Read: రోడ్ షో చేయలేదు... పోలీసులు నా దగ్గరకొచ్చి చెప్పలేదు... నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు - రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అల్లు అర్జున్ రియాక్షన్


'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'హ్యాపీ లైఫ్‌కు మైక్రో మంత్ర...' అంటూ సాగే Dhop సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఈ పాటలో రామ్ చరణ్, కియారా అద్వానీ చేసిన డ్యాన్స్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ అన్నట్టు ఉంటుందని టాక్.


ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, 'దిల్' రాజు ప్రొడక్షన్ సంస్థలపై అగ్ర నిర్మాత 'దిల్' రాజు, శిరీష్ రాజీ పడకుండా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న సంగతి తెలిసిందే.


Also Readటాలీవుడ్ మీద 'పుష్ప 2' ఎఫెక్ట్... ఇకపై బెనిఫిట్ షోలు ల్లేవ్ - టికెట్ రేట్లూ పెరగవ్