Pawan Kalyan's Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ జోడీగా మలయాళ భామ - ప్రభాస్ సినిమా తర్వాత!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. (Ustad Bhagat Singh Heroine) ఇందులో కథానాయికగా మలయాళ భామ ఛాన్స్ అందుకున్నారని తెలుస్తోంది.

Continues below advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా ఆయన వీరాభిమాని హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustad Bhagat Singh). ఇందులో హీరోయిన్ సెలక్షన్ కంప్లీట్ అయ్యిందని సమాచారం. మలయాళ భామకు ఆ ఛాన్స్ లభించిందట. 

Continues below advertisement

పవన్ జోడీగా మాళవిక!
ప్రస్తుతం మాళవిక పేరుతో తెలుగులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. రవితేజ 'నెల టికెట్', రామ్ 'రెడ్' సినిమాల్లో నటించిన మాళవికా శర్మ ఒకరు. నాగశౌర్య రీసెంట్ సినిమా 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'లో మాళవికా నాయర్ ఒకరు. మరొక హీరోయిన్... మాళవికా మోహనన్. ఇప్పుడు ఈ భామే పవన్ కళ్యాణ్ జోడీగా నటించే అవకాశం అందుకుందట. 

ప్రభాస్ సినిమాలోనూ...
మాళవికా మోహనన్ నటించిన స్ట్రెయిట్ తెలుగు సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. అయితే... డబ్బింగ్ సినిమాలు విజయ్ 'మాస్టర్', రజనీకాంత్ 'పేట'తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. ఇప్పుడు ప్రభాస్ - మారుతి సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నారు. ఆ చిత్రీకరణ పూర్తి కాకముందు పవన్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని సమాచారం.

ఆ ఇద్దరిలో మాళవిక ఎవరు?
ఈ సినిమా తమిళ హిట్ 'తెరి'కి రీమేక్. పవన్ కళ్యాణ్ ఇమేజ్, తెలుగు నేటివిటీ దృష్టిలో పెట్టుకుని హరీష్ శంకర్ కథలో చాలా మార్పులు చేశారట. 'గబ్బర్ సింగ్' చూస్తే... ఇది సల్మాన్ ఖాన్ 'దబాంగ్' రీమేకేనా? అని డౌట్ వస్తుంది. ఆ స్థాయిలో మార్పులు చేసిన అనుభవం హరీష్ శంకర్ సొంతం. ఈ సినిమాకు కూడా అలా చేశారట. అయితే, 'తెరి'లో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. ఆ ఇద్దరిలో మాళవికా మోహనన్ ఎవరి పాత్ర చేస్తున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరొక కథానాయికగా పూజా హెగ్డే పేరు పరిశీలనలో ఉన్నట్లు వినికిడి. ఒకవేళ ఆమె ఓకే అయితే... మెయిన్ హీరోయిన్ రోల్ ఆమెది అవుతుంది.

Also Read : ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించనున్నారు. సినిమాకు డిసెంబర్ లో పూజ చేశారు. త్వరలో సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

'ఉస్తాద్ భగత్ సింగ్'లో వీజే సన్నీ!
హరీష్ శంకర్ కథ అందించడంతో పాటు ఓ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన వెబ్ సిరీస్ 'ఏటీఎమ్'. అందులో వీజే సన్నీ (VJ Sunny) హీరోగా నటించారు. ఏకంగా పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమాతో నటించే ఛాన్స్ అందుకున్నారు. 'ఏటీఎమ్'కు లభిస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపిన వీజే సన్నీ... దర్శకుడు చంద్రమోహన్, నటుడు రవిరాజ్‌తో కలిసి ABP Desamకు వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పవన్ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు. 

Also Read : బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

''పవన్ కళ్యాణ్ గారితో మీరు చేయబోయే 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా సెట్స్‌కు ఒక్కసారి వస్తానని, మీతో ఫోటో దిగుతానని హరీష్ శంకర్ గారికి ఓసారి అడగాలని అనుకున్నాను. అయితే, ఓ రియాలిటీ షోకి వెళ్ళినప్పుడు ఆ సినిమాలో నేను కూడా నటిస్తున్నానని చెప్పారు. నాకు అది సర్‌ప్రైజ్. ఐయామ్ సో హ్యాపీ'' అని ఏబీపీ దేశం ఛానల్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సన్నీ చెప్పారు.

Continues below advertisement
Sponsored Links by Taboola