Malaika Arora Rents Out Her Flat: దాదాపు బాలీవుడ్‌లోని చాలామంది సెలబ్రిటీలకు ఒకటికంటే ఎక్కువగా ఇళ్లు ఉన్నాయి. తాము ఎంతో ఇష్టం కొనుకున్న ఫ్లాట్స్ నుంచి చాలామంది సెలబ్రిటీలు షిఫ్ట్ అవుతున్నారు. అందులో మలైకా అరోరా కూడా ఒకరు. మామూలుగా మలైకా గురించి ఏ చిన్న విషయం బయటికి వచ్చిన ఫ్యాన్స్ దానిని ఎంతో ఆసక్తిగా ఫాలో అవుతారు. ఎన్నో ఏళ్లుగా తను క్రియేట్ చేసుకున్న స్టార్‌డమ్ అలాంటిది. సోషల్ మీడియాలో తనకు మిలియిన్లలో ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి ఈ సీనియర్ భామ ఫ్లాట్ గురించి తాజాగా ఒక న్యూస్.. బాలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
ప్రతీ ఏడాది 5 శాతం..
ముంబాయ్‌లోని బాంద్రాలో మలైకా అరోరాకు ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్‌ను ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ కాషిష్ హాన్స్‌కు రెంట్‌కు ఇచ్చిందట మలైకా అరోరా. మూడేళ్ల పాటు ఫ్లాట్‌ను రెంట్‌కు ఇస్తున్నట్టు అగ్రిమెంట్ కూడా జరిగిందని సమాచారం. ఇక ఈ ఫ్లాట్ రెంట్ గురించి విని బీ టౌన్ ప్రేక్షకులంతా షాకవుతున్నారు. నెలకు రూ.1.57 లక్షల రెంట్‌తో ఫ్లాట్‌ను రెంట్‌కు ఇచ్చిందట మలైకా. బాంద్రా వెస్ట్‌లోని పాలీ హిల్‌లో ఈ అపార్ట్‌మెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అగ్రిమెంట్ ప్రకారం మొదటి సంవత్సరం మాత్రమే రూ.1.57 లక్షలను ప్రతీ నెల రెంట్‌గా ఇవ్వాలని, సంవత్సరం అయిపోయిన తర్వాత 5 శాతం రెంట్ పెరుగుతుందని తెలుస్తోంది.
మునుపటికంటే ఎక్కువ..
రెంట్ అగ్రిమెంట్ ప్రకారం చూస్తే మొదటి సంవత్సరం మాత్రమే నెలకు రూ.1.57 లక్షల రెంట్ కాగా తరువాతి సంవత్సరం ఇది రూ.1.65 లక్షలకు పెరుగుతుంది. ఇక దీనికి సంబంధించిన ఏప్రిల్ 29న మలైకా అరోరాకు, కాషిష్ హన్స్‌కు మధ్య అగ్రిమెంట్ జరిగినట్టు తెలుస్తోంది. అయితే సెక్యూరిటీ డిపాజిట్‌గా మలైకాకు రూ.4.5 లక్షల అమౌంట్‌ను ముందుగానే అందించాడట కాషిష్. తనకంటే ముందు ది జెఫ్ గోల్డెన్‌బర్గ్ స్టూడియో ఓనర్ అయిన జెఫ్రే గోల్డెన్‌బర్గ్‌కు తన ఫ్లాట్‌ను రెంట్‌గా ఇచ్చింది మలైకా. అప్పుడు దాని రెంట్ నెలకు రూ.1.2 లక్షలుగా ఉండేది. ఇప్పుడు దాదాపుగా రూ.40 వేల రెంట్‌కు పెంచేసింది మలైకా అరోరా.
ఇద్దరూ ఒకేసారి..
2022లో బాంద్రాలోని కాసాబ్లాంకా అపార్ట్‌మెంట్స్‌లోని తన ఫ్లాట్‌ను జెఫ్రే గోల్డెన్‌బర్గ్‌కు రెంట్‌కు ఇచ్చింది మలైకా అరోరా. అదే సమయంలో తన బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్ కూడా బాంద్రా వెస్ట్‌లోని ఔరేట్ బిల్డింగ్‌లో తనకు ఉన్న ఫ్లాట్‌ను అమ్మేవాడు. కేసీ మార్గ్ బిల్డింగ్‌లోని 19వ ఫ్లోర్‌లో అర్జున్ కపూర్‌కు ఒక ఫ్లాట్ ఉండేది. 4,364 చదరపు అడుగుల ఈ ప్రాపర్టీని రూ.16 కోట్లకు అమ్మేశాడు అర్జున్. వీరిద్దరూ ఒకేసారి తమ ఫ్లాట్స్‌ను వదిలేయడం అప్పట్లో బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక వర్క్ విషయానికొస్తే.. మలైకా అరోరా ప్రస్తుతం సినిమాలు ఏమీ చేయకపోయినా.. బుల్లితెరపైనే పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటోంది.
Also Read: ఆమెతో ఆ సీన్స్ ఎలా చేశానో అనిపించింది - వెంటనే మనీషాకు క్షమాపణలు చెప్పా: సోనాక్షి సిన్హా