Trinayani Actor Chandrakanth Died by Suicide: చందు ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. పవిత్ర మృతిని జీర్ణించుకోలేకపోయిన చందు చివరికి ఆత్మహతకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడి మరణం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే తన ఆత్మహత్యకు ముందు చందు షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రస్తుతం సంచలనం రేపుతుంది. ఇది చూసి అంతా షాక్ అవుతున్నారు. తన ఆత్మహత్యపై ముందే హింట్ ఇచ్చాడంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంతకి ఆ పోస్ట్ ఏంటేంటే.. మొదట పవిత్ర జయరాం, చందుకు పెళ్లి చేసుకున్నారని అనుకున్నారు.
కానీ వీరిద్దరు వేరు వేరు పెళ్లి కావడమే కాదు పిల్లలు కూడా ఉన్నారు. కానీ త్రినయని సీరియల్‌తో పరిచయమైన వీరిద్దరు ఆరేళ్లుగా సహాజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో కన్నడకు చెందిన పవిత్ర గతవారం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా మహబూబ్ నగర్ సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. అదే టైంలో ఆమె ప్రియుడు చంద్రకాంత్, ఆమె బంధువు కూడా ఉన్నారు. ఈ యాక్సిడెంట్‌లో పవిత్రకు పెద్దగా గాయాలు కానప్పటికి తనకు తగిలిన గాయాలు చూసి షాక్ అయ్యిందని, అదే టైంలో గుండెపోటు రావడంతో ఆమె మరణించిన పవిత్ర మరణాంతరం చందు మీడియాకు వెల్లడించారు.
మూడు రోజులుగా వరుస పోస్ట్స్
అంతేకాదు పలు ఇంటర్య్వూలో పవిత్ర మృతిని తలుచుకుని కన్నీరుమున్నీరు అయ్యాడు. అంతేకాదు సోషల్ మీడియాలో ఆమె తలుచుకుంటూ వరుస పోస్ట్స్ పెట్టాడు. అయితే ఇది పవిత్రపై ఉన్న ప్రేమ వల్ల తీవ్ర విషాదంలోకి వెళ్లాడని, ఆమె మరణాన్ని జీర్ణించుకోలేని చందు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడని అనుకున్నారు. కానీ అంతలోనే అతడి ఆత్మహత్య చేసుకోవడంతో అతడి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్స్ వైరల్ అయ్యాయి. ఇందులో రెండు రోజుల క్రితం చందు పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనం అయ్యింది. దీనికి అతడు ఇచ్చిన క్యాప్షన్ చూసి అంతా షాక్ అవుతున్నారు. అంటే చంద్రకాంత్ ముందే తన ఆత్మహత్యపై హింట్ ఇచ్చాడా? అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.
రెండు రోజుల ముందే హింట్
ఇంతకి ఆ పోస్ట్‌లో ఏముందంటే పవిత్ర జయరాంతో కలిసి దిగిన పలు పోటోలను వీడియో రూపంలో షేర్ చేశాడు. దీనికి నాన్న షేర్ చేస్తూ 'నాన్న.. ఇంకా రెండు రోజులే వెయిట్ చేయ్'అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే అంతా ఇది ఆమె ఉన్న ఇష్టంతో అలా పెట్టాడని అనుకున్నారు. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడ అతడు ఆత్మహత్య చేసుకోవడంతో నెటిజన్లు అతడి పోస్ట్‌ను వైరల్ చేస్తున్నారు. ఈ పోస్ట్ చూస్తుంటే చంద్రకాంత్ చనిపోవాలని ముందుగానే నిర్ణయించుకున్నాడని అర్థమవుతుంది. రెండు రోజులు ముందే తన ఆత్మహత్యపై హింట్ ఇచ్చినా? ఎవరూ దాన్ని కనిపెట్టేకపోయామని, ఇప్పుడు ఈ క్యాప్షన్ చూస్తే అర్థమైందంటూ అతడి పోస్ట్ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా చంద్రకాంత్ నిన్న శుక్రవారం (మే 17) సాయంత్రం హైదరాబాద్‌ని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అతడి మరణంపై చందు తల్లి, భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read: చందు సూసైడ్ కేసులో కీలకం కానున్న వాట్సాప్ ఛాట్ - మెసేజులు చెక్ చేస్తున్న పోలీసులు?