Mahesh Babu about Guntur Kaaram: త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘గుంటూరు కారం’ థియేటర్లలో సందడి చేస్తోంది. టాక్ ఎలా ఉన్నా.. ఈ సినిమా చూడడానికి వస్తున్న ప్రేక్షకుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అదే విధంగా కలెక్షన్స్ కూడా తగ్గడం లేదు. ఈ సినిమాలో మహేశ్ బాబు పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులంతా ఫిదా అయిపోతున్నారు. ‘గుంటూరు కారం’లో హైలెట్ ఏంటి అంటే చాలామంది మహేశ్ డ్యాన్స్, పర్ఫార్మెన్స్ అనే చెప్తున్నారు. ఇక ఈ మూవీలో మహేశ్ మాస్ లుక్‌కు, బీడీ తాగే స్టైల్‌ను ఫ్యాన్స్ ఇమిటేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఆ బీడీ కథ ఏంటి అని తాజాగా మహేశ్ బయటపెట్టారు. అసలు తాను స్మోక్ చేయను అని రివీల్ చేశారు.


తలనొప్పి వచ్చేసింది


‘‘నేను స్మోక్ చేయను. స్మోకింగ్‌ను ఎంకరేజ్ కూడా చేయను. అదొక ఆయుర్వేదిక్ బీడీ. లవంగం ఆకులతో తయారు చేశారు. ముందు నాకు నిజమైన బీడీ ఇచ్చారు. దాంతో నాకు తలనొప్పి, మైగ్రేన్ వచ్చేసింది. నా వల్ల కావడం లేదు త్రివిక్రమ్ ఏం చేద్దామని అడిగాను. అప్పుడు ఆలోచించి సెట్ వాళ్లు ఆయుర్వేదిక్ బీడీ అని పట్టుకొచ్చారు. వెంటనే అది చాలా బాగుందని చెప్పాను. అది ఒక మింట్ ఫ్లేవర్‌లో ఉంటుంది. అందులో పొగాకులాంటిది ఏమీ ఉండదు. అది ప్యూర్ ఆయుర్వేదిక్’’ అని బీడీ కథను బయటపెట్టారు మహేశ్ బాబు. దీంతో సినిమాలో మహేశ్ బీడీ తాగే స్టైల్‌ను కాపీ కొట్టాలని బీడీలు కొనుకుంటున్న ఫ్యాన్స్‌కు ఒక క్లారిటీ వచ్చింది. దాంతో పాటు ‘గుంటూరు కారం’లో చిరంజీవి ‘స్వయంకృషి’ రిఫరెన్స్ గురించి కూడా మాట్లాడారు.


థియేటర్లలోనే ఎక్స్‌పీరియన్ చేయాలి


‘‘స్వయంకృషిలో నా ఫేవరెట్ డైలాగ్ అది. నాకు చిరంజీవి గారంటే చాలా ఇష్టం. అదేంటో నేను ఇప్పుడు చెప్పాలని అనుకోవడం లేదు. అది థియేటర్లలో చూసి ఆడియన్సే ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఒక కామన్ మ్యాన్ ఎలా మాట్లాడతాడు అలా మాట్లాడినట్టే అనిపించింది. ఒక హీరోనే అలా చేసినప్పుడు చాలా బాగుంటుందని అనిపించింది. నాకు ప్రత్యేకంగా చిరంజీవి గారంటే చాలా గౌరవం ఉంది. ఆ డైలాగ్‌కు నేను విపరీతంగా కనెక్ట్ అయ్యాను. త్రివిక్రమ్ గారు కథ చెప్తూ ఆ మాట చెప్పినప్పుడే ముందు నవ్వొచ్చింది. తర్వాత మంచిగా అనిపించింది. థియేటర్లు అదిరిపోతాయి. మామూలుగా ఉండదు అనేశాను అప్పుడే. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ డైలాగ్ విన్నప్పుడు. ఆ డైలాగ్‌కు సుదర్శన్ థియేటర్‌లో రియాక్షన్‌ను నమ్మలేకపోయాను’’ అంటూ ‘గుంటూరు కారం’లోని ఒక ప్రత్యేకమైన డైలాగ్ గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు మహేశ్.






అలా చేయడం చాలా కష్టం


‘‘త్రివిక్రమ్, నేను కలిసి ఒక సినిమాతో వచ్చినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాదు.. క్లాస్, మాస్ అందరినీ అలరించినప్పుడే సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఒక ఫ్యామిలీ సినిమాలో రమణగాడు లాంటి క్యారక్టరైజేషన్ దింపడం చాలా కష్టం. ఎందుకంటే అది చాలా మాస్సీ ఉంటుంది. అంతే కాకుండా క్లైమాక్స్‌లో కళ్ల నుంచి నీళ్లు రావాలి. చాలా కష్టం అలా చేయడం’’ అంటూ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ గురించి తెలిపారు మహేశ్. ‘గుంటూరు కారం’ సక్సెస్ చూసి తన మనసు నిండిపోయిందని అన్నారు. శ్రీలీల కూడా ‘గుంటూరు కారం’ సెట్స్‌లో చాలా ఎంజాయ్ చేశానని తెలిపింది.


Also Read: నాలుగు రోజుల్లో 'గుంటూరు కారం' సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?