Balakrishna - Hanuman Movie: సంక్రాంతి విన్నర్ 'హనుమాన్' సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుందీ సినిమా. ఇప్పుడు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ఈ సినిమాను చూస్తున్నారు. 


'హనుమాన్' చూస్తున్న బాలకృష్ణ
బాలకృష్ణ, 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ మధ్య మంచి అనుబంధం ఉంది. వాళ్లిద్దరూ ఓ షో కోసం పని చేశారు. బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్' షో ప్రోమోలకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. షోలో కొన్ని ఎపిసోడ్స్ కూడా డైరెక్ట్ చేశారు. హీరో తేజ సజ్జతో పాటు ప్రశాంత్ వర్మ రిక్వెస్ట్ మేరకు 'హనుమాన్' చూస్తున్నారు బాలకృష్ణ. 


హైదరాబాద్ సిటీలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో బాలకృష్ణ కోసం 'హనుమాన్' స్పెషల్ షో వేశారు. ఇంటర్వెల్ సమయంలో సినిమా బావుందని ప్రశాంత్ వర్మకు బాలకృష్ణ చెప్పినట్లు సమాచారం.


Also Readకంగువా కథలో ట్విస్ట్ - సెకండ్ లుక్‌తో కాన్సెప్ట్ రివీల్ చేశారుగా






బెంగళూరులో శివన్న కోసం స్పెషల్ షో 
ప్రముఖ కన్నడ కథానాయకుడు శివ రాజ్ కుమార్ కోసం 'హనుమాన్' స్పెషల్ షో వేయడానికి సన్నాహాలు చేశారు. బెంగళూరులో ఆయన సినిమా చూడనున్నారు.


Also Readబాక్సాఫీస్ బరిలో కింగ్ నాగార్జున జోరు - రెండు రోజుల్లో 'నా సామి రంగ'కు ఎన్ని కోట్లు వచ్చాయంటే?






వంద కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన 'హనుమాన్'
'హనుమాన్'కు మొదటి నుంచి పాజిటివ్ టాక్ ఉంది. విడుదలకు ముందు నుంచి సినిమాపై మంచి బజ్ ఉంది. విడుదలైన తర్వాత సూపర్బ్ రివ్యూలతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు సైతం లభించాయి. కేవలం నాలుగు రోజుల్లో వంద కోట్లు కలెక్ట్ చేసి సినిమా సత్తా చాటింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు సరిపడా స్క్రీన్లు లభించడం లేదు. 'గుంటూరు కారం' సినిమాకు ఎక్కువ థియేటర్లు లభించాయి. అయితే... ఆ స్థాయిలో ప్రేక్షకులు రావడం లేదు. దాంతో ఇప్పుడు 'గుంటూరు కారం' తీసేసి కొన్ని థియేటర్లలో 'హనుమాన్' వేస్తున్నారు.



అమెరికాలో 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' రికార్డ్స్ బ్రేక్!
తెలుగు రాష్ట్రాలు, ఉత్తరాదిలో మాత్రమే కాదు... ఓవర్సీస్ మార్కెట్‌ (Hanuman Overseas Collection)లోనూ 'హనుమాన్'కు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. నార్త్ అమెరికాలో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల్లో టాప్ 10 సినిమాల్లో ఆల్రెడీ 'హనుమాన్' చోటు సంపాదించింది. అక్కడ 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' రికార్డ్స్ బ్రేక్ చేసింది. ప్రజెంట్ సినిమా జోరు చూస్తుంటే... రూ. 200 కోట్లు కలెక్ట్ చేయడం ఈజీ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.