Sarkaru Vaari Paata Title Song: స్పీకర్స్ పగిలిపోవాలి - సూపర్ స్టార్ 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ అప్‌డేట్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ విడుదలకు ముహూర్తం ఖాయమైంది. సాంగ్ ఎప్పుడు విడుదల చేస్తున్నారంటే?

Continues below advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులకు మరో అప్‌డేట్‌! ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'సర్కారు వారి పాట' టైటిల్ సాంగ్ (Sarkaru Vaari Paata Title Song) విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్ 23... అనగా ఈ శనివారం సాంగ్ విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. అంటే కాదు, 'ఈసారి స్పీకర్స్ పగిలిపోవాలి' అంటూ పాటపై అంచనాలు పెంచేసింది.

Continues below advertisement

Sarkaru Vaari Paata Third Song Update: 'కళావతి...', 'పెన్నీ...' - ఆల్రెడీ 'సర్కారు వారి పాట' నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు. తమన్ సంగీతం అందించిన ఆ రెండు పాటలకు మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విడుదల చేయనున్న మూడో పాట, వాటికి మించి ఉంటుందట. ఈ సాంగ్ ట్యూన్‌ను టీజర్‌లో నేపథ్య సంగీతంగా ఉపయోగించారు. శనివారం ఉదయం 11.07 గంటలకు పాటను విడుదల చేయనున్నారు (Sarkaru Vaari Paata Title Song Release Date and Time). సినిమాను విడుదలవుతున్న మూడో పాట ఇది.  


Sarkaru Vaari Paata Trailer On May 1st Week: మే తొలి వారంలో 'సర్కారు వారి పాట' ట్రైలర్ విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ తెలియజేసింది. సినిమాలో రెండు పాటలు 'కళావతి', 'పెన్నీ' విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడో సాంగ్ గురించి ఈ రోజు రాత్రి లోపు అప్‌డేట్‌ ఇస్తామని తెలిపారు. సో... సూపర్ స్టార్ ఫ్యాన్స్ సందడి చేయడానికి రెడీ అయిపోవచ్చు.

Also Read: మహేష్ 'సర్కారు వారి పాట'తో పెద్ద హిట్ కొడుతున్నాం - నిర్మాత కాన్ఫిడెన్స్, ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లో మహేష్ బాబు, హీరోయిన్ కీర్తీ సురేష్, డ్యాన్సర్లపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.దాంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మే 12న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలు.

Also Read: మంచు విష్ణుకు వంట చేసి పెట్టిన సన్నీ లియోన్

Continues below advertisement