'విక్రమ్' సినిమాలో కమల్ హాసన్ తాత పాత్రలో కనిపించారు. దానికి ముందు 'విశ్వరూపం' వంటి యాక్షన్ థ్రిల్లర్ చేశారు. అందులో హీరోయిన్ ఉన్నా టెర్రరిజం, యాక్షన్ హైలైట్ అయ్యాయి. 'చీకటి రాజ్యం'లో అయితే త్రిషతో రొమాంటిక్ ట్రాక్ లేదు. కమల్ హాసన్ ఈ సినిమాలు చేసిన టైంలో టాలీవుడ్ టాప్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలకృష్ణ, కింగ్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ కమర్షియల్ సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలు, సాంగ్స్ చేశారు.

'విక్రమ్' విడుదల తర్వాత కమల్‌ను చూసి తెలుగు హీరోలు చాలా నేర్చుకోవాలంటే సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. వయసుకు తగ్గ క్యారెక్టర్లు చేయాలని, ఆ పాటలేంటి? హీరోయిన్లతో రొమాంటిక్ సీన్లు ఏంటి? అంటూ విమర్శించిన నెటిజనులు చాలా మంది ఉన్నారు. 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి' సినిమాలలో శృతి హాసన్ హీరోయిన్ కావడంతో... కమల్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తుంటే, ఆయన కూతురుతో చిరు, బాలయ్య నటిస్తున్నారని తమిళ్ ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి విమర్శలు వచ్చాయి. 'థగ్ లైఫ్' ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆ విమర్శలకు కౌంటర్లు ఇస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్.

త్రిషతో రొమాన్స్ ఏంటి?అభిరామితో లిప్ లాక్ ఏంటి?'థగ్ లైఫ్' ట్రైలర్ చూశారా? అభిరామితో కమల్ హాసన్ లిప్ లాక్ సీన్ చేశారు. ఈ ఇద్దరూ హీరో హీరోయిన్లుగా నటించిన 'పోతురాజు'లోనూ లిప్ లాక్ ఉంది. అయితే ఆ సినిమా వచ్చి చాలా ఏళ్లు అయ్యింది. ఇప్పుడు కమల్ హాసన్ వయస్సు 70 సంవత్సరాలు. అభిరామి వయస్సు 41 ఏళ్ళు. త్రిష ఆమె కంటే ఏడాది పెద్ద. ఆమె వయస్సు 42. తన కంటే వయసులో 30 ఏళ్లు చిన్న అయినటువంటి హీరోయిన్లతో ఆ రొమాంటిక్ సీన్స్ ఏంటి? లిప్ లాక్ ఏంటి? అంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ క్రిటిసైజ్ చేస్తున్నారు.

Also Read: 'బేబీ' హిందీ రీమేక్‌ నుంచి హీరో అవుట్... ఆ ఇద్దరి మధ్య మంట పెట్టిన వీడియో? ఆన్‌లైన్‌ గొడవ??

కమల్ హాసన్‌ను చూసి చిరంజీవి బాలకృష్ణ నేర్చుకోవాలని తెలుగు యువత కొంత మంది చెబుతుంటారని, అయితే 70 ఏళ్ళ వయసులో కమల్ హాసన్ ఏం చేస్తున్నారో చూడమని కొందరు ట్వీట్లు చేశారు కొందరు. ఈ వయసులో కూడా కమల్ మారలేదు అంటూ కొంతమంది కామెంట్ చేశారు. కొంతమంది అయితే 'ముసలోడికి దసరా పండుగ', 'ముసలోడే కానీ మహానుభావుడు' అంటూ కూడా కామెంట్ చేశారు. ఎటు చూసినా ఈ సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం లభిస్తుంది.

Also Read: సుప్రీతా నాయుడుకు మరో సినిమా ఛాన్స్... 'అమరావతికి ఆహ్వానం'లో సురేఖ వాణి కుమార్తె