Dil Raju React on 'Guntur Karam' Result: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌-సూపర్‌ స్టార్‌ కాంబినేషన్‌ తెరకెక్కిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్‌ షో నుంచి మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇండస్ట్రీ హిట్‌ అనుకున్న ఈ సినిమాకు కాస్తా నెగిటివ్‌ రివ్యూస్‌ వినిపించడంతో ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ డిసప్పాయింట్‌ అయ్యారు. అంతేకాదు గుంటూరు కారంపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ చేస్తూ మిమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా గుంటూరు కారం రిజల్ట్‌పై ఈ మూవీ నిర్మాత నాగవంశీ నైజాం, ఉత్తరాంధ్ర డిస్ట్రీబ్యూటర్‌ దిల్‌ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు ఆడియన్స్‌, మీడియా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మూవీ రిజల్ట్‌పై స్పందిస్తూ.. ఇది ఫ్యామిలీ ఎమోషన్‌ మూవీ అని, ఆడియన్స్‌ సినిమా చూసి ఎంజాయ్‌ చేస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


ఇది కంప్లీట్ పండగ సినిమా..


దిల్‌ రాజు మాట్లాడుతూ.. "అర్థరాత్రి ఒంటి గంట మూవీ ప్రీమియర్స్‌ షోస్‌ తర్వాత మూవీకి మిక్స్‌డ్‌ రివ్యూస్‌ వచ్చాయని నాగవంశీ చెప్పాడు. నాకు ఫోన్‌ చేసిన వాళ్లలో కూడా కొందరు బాగుందని, మరికొంద యావరేజ్‌ అని చెప్పారు. కానీ తర్వాత షోస్‌ చూసిన వారంతా మూవీ బాగుందన్నారు. అయితే రివ్యూస్‌ చూసిన తర్వాత క్రాస్‌ చెక్‌ చేసకోవడానికి సుదర్శన్‌ థియేటర్‌కు వెళ్లి మళ్లీ సినిమాను చూశాను. ఆడియన్స్‌ అంతా సినిమా మొత్తం ఎంజాయ్‌ చేశారు. త్రివిక్రమ్‌ డైలాగ్, మహేష్‌ యాక్షన్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మొదట సినిమా చూసి నేను ఏదైతో ఫీల్‌ అయ్యానో రెండోసారి కూడా అదే అనిపించింది. ఈ కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ. మహేష్‌ క్యారెక్టరైజేషన్‌ను బేస్‌ చేసుకుని తీసిన సినిమా ఇది. ఇది తల్లి, కొడుకుల మధ్య సాగే ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామా. సో సినిమా బాగలేదు బాగలేదు అని మైండ్‌ సెట్‌తో వెళ్లిన వారంత మూవీలోని విషయానికి కనెక్ట్‌ అవుతున్నారు. 


సినిమా ఇంత బాగుంటే బాగోలేదంటున్నారేంటి అని థియేటర్‌ నుంచి బయటకు వస్తున్నారు. అలా హిట్‌ అయిన సినిమాలను గతంలో కూడా చూశాం. గుంటూరు కారం కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌ మూవీ. సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్‌ చేసే సినిమా ఇది. మిక్స్‌డ్‌ టాక్‌, నెగిటివ్ టాక్స్‌ అనేవి కామన్. కానీ, ఫైనల్‌ పండగ తర్వాత మూవీకి ఎంత కలెక్షన్స్‌ వచ్చాయి? గత మహేష్‌ సినిమా కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి? ఇప్పుడ ఈ సినిమా కలెక్షన్స్‌ ఎంత వచ్చాయి లెక్క వేసిన తర్వాత మూవీ రిజల్ట్‌ను నిర్ణయిస్తాం. కాబట్టి అప్పటి వరకు మేము ఎవరి మీద కామెంట్స్‌ చేసేది లేదు, చెప్పేది లేదు" అంటూ చెప్పుకొచ్చారు. 


నిర్మాత నాగవంశీ కామెంట్స్..


అనంతరం నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. "గుంటూరు కారం నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. అన్ని ఎలిమెంట్స్ ఉన్న ప్రాపర్ పండగ సినిమా ఇది. ఈ మూవీ ఫస్ట్‌ కలెక్షన్స్‌ మేము ఊహించిన దానికంటే బెటర్‌గా ఉన్నాయి. మా సినిమాను ఆడియన్స్‌ బాగా ఆదరించారు. అందరు మహేష్‌ బాబు-త్రివిక్రమ్ సినిమా చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు. ఒంటిగంటకు పడ్డ షోకు మిక్స్‌డ్ రివ్యూస్‌ వచ్చినా.. సాయంత్రం ఫస్ట్‌ అండ్‌ సెకండ్‌ షోలకు అవి పాజిటివ్‌గా వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ అంతా థియయేటర్లకు వెళ్లి సినిమాను ఎంజాయ్‌ చేశారు. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. నేను గ్యారంటీ ఇస్తున్నా" అని అన్నారు.