SS Rajamouli Dance : దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం ఫ్యామిలీ టైమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన డాన్స్ చేసిన వీడియోనే చక్కర్లు కొడుతోంది. శ్రీసింహ పెళ్లిలో రాజమౌళి ఫుల్ చిల్ అవుతున్న ఆ వీడియోని చూసిన మహేష్ అభిమానుల బాధ అంతా ఇంతా కాదు. మహేష్ సినిమాను పక్కన పెట్టి రాజమౌళి ఇలా డ్యాన్సులు వేయడం మహేష్ అభిమానులకు మింగుడు పడడం లేదు. 


రాజమౌళి చిల్ - మహేష్ ఫ్యాన్స్ గుర్రుగా... 
జక్కన్న దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పాన్ వరల్డ్ సినిమా 'ఎస్ఎస్ఎంబి 29' రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. రీసెంట్ గా ఈ మూవీ లొకేషన్ సర్చ్ లో రాజమౌళి బిజీగా ఉన్నారు అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో జక్కన్న త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాడని కాస్త హ్యాపీగా ఫీల్ అయ్యారు మహేష్ అభిమానులు. ఇక జనవరిలో ఈ సినిమా పై అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు సెట్స్ పైకి వెళ్ళబోతోంది అనే వార్త వాళ్లను నిద్ర పోనివ్వలేదు. కానీ తాజాగా జక్కన్న డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహేష్ అభిమానులు తెగ బాధ పడిపోతున్నారు. 


ఇట్స్ ఫ్యామిలీ టైమ్ 
దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా వెయ్యి కళ్ళతో మహేష్ - రాజమౌళి సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే,  రాజమౌళి మాత్రం మహేష్ సినిమా పనుల్ని పక్కన పడేసి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. కీరవాణి తనయుడు శ్రీ సింహ పెళ్లిని ఘనంగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుకల్లోనే రాజమౌళి తన భార్యతో కలిసి స్టెప్పులు వేశారు. గతంలోనే రాజమౌళి డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే. రెండ్రోజుల క్రితం మరో మీడియా బయటకు రావడం చూసాము. కానీ అంతలోనే ఎన్టీఆర్ 'దేవర' సినిమాలోని ఆయుధ పూజకు రాజమౌళి డాన్స్ చేసిన కొత్త వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ వీడియోలో ఎన్టీఆర్ వేసిన స్టెప్పుల్ని రాజమౌళి రీ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇక కాలభైరవ కలిసి జక్కన్న వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 






మొత్తానికి రాజమౌళి ఇలా సెలబ్రేషన్స్ లో మునిగిపోతే, మరోవైపు మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం మేము డిప్రెషన్ తో పోయేలా ఉన్నాం సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి - మహేష్ బాబు కాంబోలోని సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుంది? షూటింగ్ ఎప్పుడు షురూ అవుతుంది ? అని చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. కానీ ప్రస్తుతం రాజమౌళి తీరు చూస్తుంటే ఈ ఏడాది సినిమాకు సంబంధించిన అప్డేట్ ఉండదని అర్థమైపోయింది. చివరగా ఈ ఏడాది మొదట్లో 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు... ఆ తర్వాత జక్కన్న కోసం తన లుక్ మార్చుకునే పనిలో బిజీగా అయిపోయారు. ఓసారి గుబురు గడ్డంతో కనిపిస్తే, మరోసారి పొడవైన జుట్టుతో అందరికీ షాక్ ఇచ్చారు. ఇక కొంతకాలం నుంచి మహేష్ బాబు బయట కనిపించడం మానేసిన సంగతి తెలిసిందే.



Read Also :  Aansuya Bharadwaj: నాకు 2024 నేర్పిన పాఠాలు ఇవే... అనసూయ పోస్ట్ వైరల్