Maha Veerudu OTT Release : కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటించిన తమిళ యాక్షన్ కామెడీ-డ్రామా చిత్రం 'మహా వీరుడు' ఈ రోజు పలు చోట్ల రిలీజ్ కాగా.. మరి కొన్ని చోట్ల మాత్రం కంటెంట్ ఆలస్యంగా కారణంగా షోస్ ను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఆన్ లైన్ విడుదలకు సంబంధించి ఓ అప్ డేట్ వైరల్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని శాంతి టాకీస్‌ ​​గత కొన్ని రోజుల క్రితమే ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.


'మహా వీరుడు' డిజిటల్ హక్కులను అమెజాన్ సొంతం చేసుకుందని ట్వీట్ లో పేర్కొంది. తాజాగా ఈ సినిమా థ్రియేటికల్ హక్కులను అమెజాన్ రూ.33 కోట్లకు కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శివ కార్తికేయన్ ఇప్పటివరకు నటించిన సినిమాల్లో అత్యంత ఓటీటీ ధరకు అమ్ముడైంది ఈ సినిమానే కావడం గమనార్హం. ఈ సినిమా ఆగష్టు నెలాఖరు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. కాగా మహా వీరుడు మూవీ అమెజాన్ లో ఎప్పట్నుంచి విడుదల కానుందన్న విషయాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


మడోన్నా అశ్విన్ రూపొందించిన ఈ యాక్షన్ కామెడీ డ్రామా 'మహా వీరుడు' మూవీకి దర్శకుడిగా వ్యవహరించగా.. ఈ సినిమాలో శివకార్తికేయన్ తో పాటు అదితి శంకర్, మిస్కిన్, యోగి బాబు, సరిత, సునీల్, మోనిషా బ్లెస్సీ , తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా రిలీజ్ కానుండగా.. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ ఈ మూవీని నిర్మించారు.






'మహా వీరుడు' సినిమా పూర్తిగా యాక్షన్-కామెడీ అంశాలతో కూడిన మిస్టరీ స్టోరీ. ఇది ఒక రాజకీయ నాయకుడు, న్యూస్ ఛానెల్ ఆర్ట్ డైరెక్టర్ మధ్య జరిగే సన్నివేశాలను చూపించారు. ఒక రాజకీయ నాయకుడు తన జీవితాన్ని మెరుగ్గా మలచుకోవడం కోసం ఎలాంటి పనులు చేశాడు? వాటిని హీరో ఎలా తిప్పికొట్టాడు అన్నది సినిమా సారాంశంగా తెలుస్తోంది.


ఇదిలా ఉండగా రూ.35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'మహా వీరుడు' సినిమా.. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్, శివ కార్తికేయన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో నటించిన నటులు, కథ, టాలెంట్ దర్శకుడు.. లాంటి ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉండడమేనని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమా స్టాండర్డ్స్‌ను అందుకుంటే ఈ ఏడాది టాప్ తమిళ సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.


Read Also : Baby Movie 2023 Review - 'బేబీ' రివ్యూ : ఆనంద్, విరాజ్ - ఇద్దరిలో వైష్ణవి చైతన్య ఎవరి పిల్ల? సినిమా ఎలా ఉందంటే?






ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial