మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా యువ దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) తెరకెక్కించిన సినిమా 'రావణాసుర' (Ravanasura Movie). ఇప్పటి వరకు రవితేజ మాస్ క్యారెక్టర్ చేయడం మీరు చూసి ఉంటారు. క్లాస్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో చూసి ఉంటారు. ఫర్ ద ఫస్ట్ టైమ్... నెగిటివ్ షెడ్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో 'రావణాసుర'లో చూడబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదల అయ్యింది. అది ఎలా ఉందంటే?
ట్రైలర్ ఎలా ఉందంటే?
'వాడు క్రిమినల్ లాయర్ కాదు... లా చదివిన క్రిమినల్' - 'రావణాసుర' సినిమా, అందులో రవితేజ క్యారెక్టర్ గురించి చెప్పడానికి మలయాళ నటుడు జయరామ్ చెప్పిన ఈ ఒక్క డైలాగ్ చాలు. 'వాడు చాలా డేంజర్ గాని లెక్క ఉన్నాడు తమ్మి' - మరో నటుడు రావు రమేష్ చెప్పే డైలాగ్ ఇది. 'మర్డర్ చేయడం క్రైమ్. దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్. అయామ్ ఎన్ ఆర్టిస్ట్. నా ఆర్ట్ ను రెస్పెక్ట్ చెయ్ బేబీ' అని రవితేజ ఓ డైలాగ్ చెప్పారు. సినిమా కథ అంతా మర్డర్ చుట్టూ తిరుగుతుందని అర్థం అవుతోంది.
డైలాగులకు తగ్గట్టు రవితేజను చాలా పవర్ ఫుల్ పాత్రలో సుధీర్ వర్మ ప్రజెంట్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్ గ్లింప్స్ చూపిస్తూ సినిమాపై హైప్ పెంచారు. అంతే కాదు... సినిమాలో మంచి కామెడీ కూడా ఉందని స్టార్టింగ్ సీన్స్ చూస్తే ఈజీగా అర్థం అవుతోంది.
'లోపలి వచ్చేటప్పుడు డోర్ కొట్టాలని తెలియదా?' అని ఫరియా అబ్దుల్లా అడిగితే... 'సరసాలు ఆడుకునేటప్పుడు డోర్ వేసుకోవాలని తెలియదా?' అని రవితేజ ఎదురు ప్రశ్న వేశారు. ఆ సన్నివేశంలో శ్రీరామ్, ఫరియా సోఫాలో ఉన్నారు. ఫరియా దగ్గర పని చేసే జూనియర్ లాయర్ క్యారెక్టర్ రవితేజ చేసినట్టు ఉన్నారు. ఆయనతో ఉండే పాత్రలో 'హైపర్' ఆది కనిపించారు. కామెడీ, యాక్షన్, ఎమోషన్... సినిమాలో అన్నీ ఉన్నాయని అర్థం అవుతోంది.
Also Read : ఉపాసన బేబీ బంప్ అదిగో - ఇంకా ఎనీ డౌట్స్?
ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు...
రవితేజ 'ధమాకా'కు సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన భీమ్స్ సిసిరోలియోతో పాటు హర్షవర్ధన్ రామేశ్వర్ 'రావణాసుర' సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఆల్రెడీ నాలుగు పాటలు విడుదల చేశారు. అందులో మూడు పాటలకు హర్షవర్ధన్ బాణీలు అందించగా... ఓ పాటను భీమ్స్ చేశారు. పాటలకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం పేర్కొంది. ఏప్రిల్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
లాయర్ రోల్ చేసిన రవితేజ!
'రావణాసుర' సినిమాకు వస్తే... అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ సంస్థలపై అభిషేక్ నామా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ న్యాయవాది పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఏయన్నార్ మనవడు, కింగ్ అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ కీలక పాత్ర చేస్తున్నారు. 'విక్రమార్కుడు', 'పవర్' సినిమాల్లో రవితేజ పోలీస్ రోల్ చేశారు. అయితే, ఆయన లాయర్ రోల్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్!
ఐదుగురు హీరోయిన్లు!
'రావణాసుర' సినిమాలో హీరోయిన్లు ఎంత మంది ఉన్నారో తెలుసా? మొత్తం ఐదు మంది! అవును... ఇందులో అనూ ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా, 'బంగార్రాజు'లో ఓ పాటలో మెరిసిన దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. ఎవరికి ఎంత స్క్రీన్ స్పేస్ ఉంటుంది? ఎవరు మెయిన్ రోల్ చేశారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.
Also Read : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా