మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి, ఎంట్రప్రెన్యూర్ ఉపాసన (Upasana Konidela) ఇప్పుడు ఆరు నెలల గర్భవతి. ఆమె ప్రెగ్నెంట్ అని మెగా ఫ్యామిలీ అనౌన్స్ చేసిన క్షణం నుంచి కొంత మంది డౌట్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. 'నిజంగా ఉపాసన ప్రెగ్నెంటా? లేదంటే సరోగసీకి వెళుతున్నారా?' అని!
ఆస్కార్ వేడుకలకు ఉపాసనను తీసుకుని రామ్ చరణ్ వెళ్లారు. అప్పుడు దిగిన ఫోటోలు చూస్తే... కొన్నిటిలో బేబీ బంప్ కనపడింది. అయినా సరే కొందరు 'అది బేబీ బంప్ ఆ?' అని సందేహాలు వ్యక్తం చేశారు. అప్పటికీ ఉపాసన గర్భవతి అని నమ్మలేదు. ఆ అనుమానాలు అన్నిటికీ రామ్ చరణ్ బర్త్ డే పార్టీ ఫోటోలు చెక్ పెడతాయని చెప్పవచ్చు.
చరణ్ బర్త్ డేలో ఉపాసనను చూశారా?
రామ్ చరణ్ బర్త్ డే (Ram Charan Birthday) సందర్భంగా మెగాస్టార్ ఇంట్లో పార్టీ జరిగింది. నాగచైతన్య, అఖిల్, అమలతో నాగార్జున, రాజమౌళి అండ్ కీరవాణి ఫ్యామిలీ, వెంకటేష్, రానా, విజయ్ దేవరకొండ, కాజల్ అగర్వాల్ ఫ్యామిలీ ఇంకా చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. అందరిలో ఉపాసన హైలైట్ అయ్యారు.
రామ్ చరణ్ పుట్టిన రోజున ఉపాసన వేసుకున్న డ్రస్ చూశారా? బ్లూ కలర్ డ్రస్ ధరించారు. అందులో బేబీ బంప్ చాలా క్లారిటీగా కనిపించింది. దీంతో ఉపాసన ప్రెగ్నెన్సీపై అనుమానులు అన్నీ క్లియర్ అవుతాయని చెప్పవచ్చు.
Also Read : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?
రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన (Upasana) వివాహం ఎప్పుడు జరిగిందో గుర్తు ఉందా? జూన్ 14, 2012లో వాళ్ళిద్దరి పెళ్లి జరిగింది. వివాహమైన పదకొండేళ్లకు వాళ్లిద్దరూ తల్లిదండ్రులు కానున్నారు. అపోలో ఆస్పత్రిలో ఇక్కడి వైద్యులతో పాటు కొంత మంది విదేశీ వైద్యుల పర్యవేక్షణలో డెలివరీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఉపాసన డెలివరీకి ఫేమస్ అమెరికన్ గైనకాలజిస్ట్!
ఇండియాలో, అపోలో ఆస్పత్రిలో ఉపాసన డెలివరీ ఏర్పాట్లు చేశారు. గత నెలలో... ఫిబ్రవరి 22న 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో పాల్గొన్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా, అందులోని 'నాటు నాటు...' పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం, ఆస్కార్ నామినేట్ కావడం వంటి అంశాలతో పాటు షోలో రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ గురించి కూడా డిస్కషన్ జరిగింది. త్వరలో ఆయన తండ్రి కానున్న నేపథ్యంలో ఆ ప్రస్తావన కూడా వచ్చింది.
Also Read : తండ్రి ఫోటోతో వారసుడు - తారకరత్న మరణం తర్వాత తొలిసారి...
అమెరికాలోని ప్రముఖ గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ 'గుడ్ మార్నింగ్ అమెరికా' షోలో కో హోస్ట్! ఆమెను కలవడం సంతోషంగా ఉందని చెప్పిన చరణ్... ఫోన్ నంబర్ తీసుకుంటానని పేర్కొన్నారు. తన భార్య (ఉపాసన) అమెరికా వస్తుందని, డెలివరీకి తమరు అందుబాటులో ఉంటే బావుంటుందని జెన్నిఫర్ ఆస్టన్ (Jennifer Ashton) తో చరణ్ తెలిపారు. అందుకు జెన్నిఫర్ ఒకే అన్నారు. ''మీతో ట్రావెల్ చేయడానికి రెడీ. మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడం నాకు గౌరవమే'' అని ఆమె పేర్కొన్నారు.
జెన్నిఫర్ ఆస్టన్ టూ స్వీట్ అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. త్వరలో ఆమెను కలవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇండియాలోని అపోలో ఆస్పత్రుల కుటుంబంలో డాక్టర్లు సుమనా మనోహర్, రూమా సిన్హాతో కలిసి డెలివరీ చేయమని రిక్వెస్ట్ చేశారు. అందుకు జెన్నిఫర్ ఓకే చెప్పారు. సో, అపోలోలో ఉపాసన డెలివరీకి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నమాట. అదీ సంగతి!