Viral Girl Monalisa: మహాకుంభ్‌లో వైరల్ అయిన మోనాలిసాకు అదృష్టం కలిసొచ్చింది. బాలీవుడ్ సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చిన తర్వాత ఇప్పుడు సౌత్ సినిమా ఛాన్స్ కూడా దొరికింది. ఓ మలయాళీ సినిమాలో ఆఫర్ రావడంతో త్వరలో సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మోనాలిసా. ఈ మధ్యే పూజా కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకున్న ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

Continues below advertisement



  •  ఓన్‌మనోరమా నివేదిక ప్రకారం, మోనాలిసా నటిస్తున్న మలయాళ చిత్రం 'నాగమ్మ'

  • ఈ సినిమాలో ఆమెతో పాటు నీలాథమర సినిమాతో పేరు తెచ్చుకున్న నటుడు కైలాష్ కూడా కనిపించనున్నారు.

  • జీలీ జార్జ్ నిర్మించనున్న  'నాగమ్మ' సినిమాకు  పి. బీను వర్గీస్ దర్శకుడు 



'నాగమ్మ' షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?



  • 'నాగమ్మ' షూటింగ్  సెప్టెంబర్ చివరిలో ప్రారంభం కావచ్చు.

  • ఇటీవల కొచ్చిలో మోనాలిసా చిత్రం 'నాగమ్మ' పూజా కార్యక్రమం జరిగింది.

  • ఈ సందర్భంగా మోనాలిసా, ఇతర నటీనటులతో పాటు చిత్ర నిర్మాత సిబి మలయిల్ కూడా పాల్గొంది.



'ది డైరీ ఆఫ్ మణిపూర్'తో బాలీవుడ్ డెబ్యూ


మోనాలిసా ఇప్పటికే 'ది డైరీ ఆఫ్ మణిపూర్' అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది.  సనోజ్ మిశ్రా దర్శకత్వం వహించిన 'ది డైరీ ఆఫ్ మణిపూర్' లో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ విడుదల తేదీ ఇంకా అనౌన్స్ చేయలేదు. 


సంగీత వీడియో 'సాదగి'తో మనసు గెలుచుకుంది


నటనలోకి ప్రవేశించే ముందు, మోనాలిసా ఓ  సాంగ్ చేసింది.   'సాదగి'  పేరుతో  విడుదలైన ఆ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.   






అందమైన కళ్ళతో మోనాలిసా పాపులర్ అయ్యింది


మహాకుంభ్ మేళాలో పూలమాలలు అమ్మే మోనాలిసా కళ్లు అందర్నీ కట్టిపడేశాయ్.  మహాకుంభ్ లో ప్రత్యేకంగా నిలిచింది మోనాలిసా.  ఆ క్రేజ్ నటిగా టర్న్ అయ్యే అవకాశం అందించింది.  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది మోనాలీసా.   ఇన్‌స్టాగ్రామ్‌లో మహాకుంభ్ మోనాలిసాకు 731K ఫాలోవర్లు ఉన్నారు 


మహా కుంభమేళా మోనాలిసా అసలు పేరు మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఈమె, జీవనోపాధి కోసం ప్రయాగ్‌రాజ్‌లో పూసలు , రుద్రాక్షలు అమ్మేది. అందమైన కళ్లు అందర్నీ కట్టిపడేశాయ్.. ఫొటోలు, వీడియోలు తీసి కుంభమేళా మోనాలిసా పేరుతో వైరల్ చేశారు. ఒక్కరోజులో స్టార్ అయిపోయింది. అత్యుత్సాహం వల్ల ఆమెకు ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. కొంతమంది ఆమెను IAS అధికారి అని మారువేషంలో పూసలు అమ్ముతోందంటూ ప్రచారం చేశారు. AI ద్వారా ఫేక్ వీడియోస్ కూడా క్రియేట్ చేశారు. తన వ్యాపారం దెబ్బతింటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వీడియోస్ చూసిన బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెకు హీరోయిన్ ఆఫర్ ఇచ్చాడు. ది డైరీ ఆఫ్ మణిపూర్ పేరుతో తెరకెక్కుతోన్న సినిమాలో ఆమె రిటైర్డ్ ఆర్మీ అధికారి కూతురి పాత్రలో కనిపిస్తుందని టాక్. 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాకోసం మోనాలిసా భోంస్లే 21 లక్షల రూపాయలు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు సౌత్ లో అడుగుపెడుతోంది. మూవీ సక్సెస్ అయితే దక్షిణాదిన మరిన్ని అవకాశాలు అందుకుంటుందేమో!