యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా 'కేజిఎఫ్', 'సలార్' వంటి పాన్ ఇండియా యాక్షన్ బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే ఆ చిత్రానికి 'డ్రాగన్' (Dragon Movie) టైటిల్ ఖరారు చేశారు అయితే అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. హీరోయిన్ ఎవరనేది కూడా ఇంకా చెప్పలేదు. అయితే శివ కార్తికేయన్ 'మదరాసి' నిర్మాత ఎన్వీ ప్రసాద్ హీరోయిన్ గురించి అప్డేట్ ఇచ్చారు. 'డ్రాగన్' టీం రివీల్ చేయని పేరును ఆయన చెప్పేశారు.
ఎన్టీఆర్ జంటగా రుక్మిణి వసంత్!
కన్నడ సినిమాలు 'సప్త సాగరాలు దాటి ఏ & బి' తెలుగులోనూ డబ్బింగ్ అయ్యాయి. ఆ రెండిటిలో కథానాయకగా నటించిన అమ్మాయి గుర్తుందా? పేరు రుక్మిణి వసంత్ (Rukmini Vasanth). తెలుగులోనూ సప్త సాగరాలు వల్ల ఆవిడకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. నిఖిల్ సరసన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో', విజయ్ సేతుపతి 'ఏస్' సినిమాలో కూడా నటించింది.
Rukmini Vasanth Role In Dragon Movie: ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న 'డ్రాగన్'లో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఈ విషయం కొన్ని రోజుల క్రితం బయటకు వచ్చింది. అయితే ఎన్టీఆర్ సినిమాలో రుక్మిణి వసంత్ నటిస్తున్న విషయాన్ని నిర్మాత ఎన్వీ ప్రసాద్ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది జూన్ 25న సినిమా విడుదల కానుంది.
శివ కార్తికేయన్ కథానాయకుడిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన సినిమా 'మదరాసి'. తెలుగు, తమిళ భాషలలో ఈ నెల 5వ తేదీన విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్. ఆమె గురించి నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ... ''మా సినిమాలో ఈ అమ్మాయి (రుక్మిణి వసంత్)ని తీసుకునే సమయానికి ఆవిడ చేతిలో పెద్ద సినిమాలు లేవు. మా సినిమా తర్వాత ఎన్టీఆర్ (డ్రాగన్) సినిమా అవకాశం వచ్చింది యష్ 'టాక్సిక్' సినిమాలో కూడా హీరోయిన్ ఆ అమ్మాయి. మరొక సినిమా కూడా చేస్తుంది'' అని అసలు విషయాన్ని బయటపెట్టారు.
Also Read: మాల్దీవుల్లో చందమామ... భర్తతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కాజల్ అగర్వాల్
'మదరాసి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే చెప్పలేనని రుక్మిణి వసంత్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రశాంత్ నీల్ కథ అందించిన 'భగీర' సినిమాలో ఆవిడ నటించారు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ 'డ్రాగన్'లో ఆమెకు అవకాశం వచ్చింది. ప్రస్తుతం కన్నడ, తెలుగు, తమిళ భాషలలో రుక్మిణి వసంత్ పేరు మార్మోగుతోంది. త్వరలో ఆవిడ స్టార్ హీరోల సరసన మరిన్ని అవకాశాలు అందుకోవచ్చని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also Read: మదర్ రోల్స్ వైపు షిఫ్ట్ అవుతున్న శ్రియ... అప్పుడు 'దృశ్యం', 'ఆర్ఆర్ఆర్' - ఇప్పుడు 'మిరాయ్'