టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ గత కొంతకాలంగా బాక్సాఫీస్ వద్ద వరుస అపజయాలను అందుకుంటున్నాడు. గోపీచంద్ హిట్ కొట్టి చాలా కాలమైంది. రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన 'రామబాణం' బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. 'రామబాణం' ప్లాప్ తో గోపీచంద్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. దీంతో ఇప్పుడు రొటీన్ మూవీస్ కాకుండా తన రూట్ మార్చుకుని కాస్త డిఫరెంట్ గా ట్రై చేస్తూ తాజాగా తన కొత్త సినిమాని అనౌన్స్ చేశాడు. ఈసారి కన్నడ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఈ క్రమంలోనే ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇక ఈ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఆడియన్స్ ఒకింత థ్రిల్ ఫీల్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాతో తన రూట్ పూర్తిగా మార్చేసాడు గోపీచంద్. అందుకు నిదర్శనమే తాజాగా విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్. కన్నడ దర్శకుడు ఏ. హర్ష దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న ఈ సినిమాకి 'భీమా' అనే టైటిల్ ని ఖరారు చేశారు.


ఇందుకు సంబంధించి పవర్ఫుల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేయగా.. ఈ పోస్టర్లో ఓ పక్క రంకెలేస్తున్న ఎద్దును చూపిస్తూ, మరోపక్క మీసంతో పౌరుషం చూపిస్తున్న పోలీస్ ఆఫీసర్‌గా గోపీచంద్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. అంతేకాదు ఈ పోస్టర్లో గోపీచంద్ కోర మీసాలతో ఎంతో గంభీరంగా కనిపిస్తున్నాడు. ఒకవిధంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ గోపీచంద్ లో ఉన్న వైల్డ్ క్యారెక్టర్ ని సూచిస్తుందని చెప్పొచ్చు. ఈ పోస్టర్ని బట్టి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెబుతూ సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. ఇక గోపీచంద్ తన రూటు పూర్తిగా మార్చేసి ఇప్పుడు రఫ్ లుక్ తో పవర్ఫుల్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాతో కచ్చితంగా భారీ కం బ్యాక్‌ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ సినిమాకి కేజిఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసృర్ సంగీతం అందించబోతుండడంతో సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా గూస్ బంప్స్ తెప్పించడం గ్యారెంటీ అని చెప్పాలి.


ఇక కన్నడలో ఇప్పటికే పలు బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన దర్శకుడు హర్ష ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అరంగేట్రం చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఇతర అంశాలతో కూడిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ఈ దర్శకుడు కన్నడ అగ్ర హీరో శివరాజ్ కుమార్ తో 'వేద' అనే సినిమాని తెరకెక్కించాడు. హై వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కన్నడలో మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక కన్నడలో 'వేదా' వంటి హిట్ తర్వాత ఇప్పుడు తెలుగులో గోపీచంద్ తో సినిమా చేస్తుండడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. అక్కడ హీరో పై హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. కాగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బానర్పై కేకే రాధామోహన్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. రవి బస్సుర్ సంగీతం అందిస్తున్నారు. స్వామీ జీ గౌడ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. వెంకట్, డాక్టర్ రవి వర్మ ఫైట్స్ అందించనున్నారు.


#BHIMAA pic.twitter.com/a4R9gQb6mK