మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) ను అభిమానులు ముద్దుగా 'లాలెట్టన్' అని పిలుచుకుంటారు. తెలుగు ప్రేక్షకులకూ ఆయన సుపరిచితులే. మన తెలుగు సినిమాల్లోనూ ఆయన నటిస్తున్నారు. మరో మాలీవుడ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. మణిరత్నం 'విలన్' సహా ఆయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులో విడుదల అయ్యాయి.


మోహన్ లాల్... పృథ్వీరాజ్... హిట్ గురూ!మలయాళంలో హీరోగా మోహన్ లాల్, దర్శకుడిగా పృథ్వీరాజ్‌ది హిట్ కాంబినేషన్. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమా ఉంది కదా! మోహన్ లాల్ హీరోగా నటించిన 'లూసిఫర్'కి రీమేక్ అది. ఆ సినిమాతో పృథ్వీరాజ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత మోహన్ లాల్ హీరోగా 'బ్రో డాడీ' సినిమా చేశారు. 'లూసిఫర్' యాక్షన్ ఫిల్మ్ అయితే... 'బ్రో డాడీ' రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. రెండూ మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు మూడో సినిమాకు రెడీ అవుతున్నారు.
 
లూసిఫర్ 2 (Lucifer 2 Empuraan) షురూ!
'లూసిఫర్' సీక్వెల్‌కు 'లూసిఫర్ 2 ఎంపరర్' టైటిల్ ఖరారు చేశారు. షార్ట్ కట్‌లో 'L2E Movie' అంటున్నారు. ఈ ఏడాది మేలో సినిమా స్క్రీన్ ప్లే కంప్లీట్ చేసినట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక అప్ డేట్ ఇచ్చారు. లేటెస్టుగా సినిమా టీమ్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. మోహన్ లాల్, నిర్మాత ఆంటోనీ పెరంబవూర్, నటుడు మురళీతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ రోజు సాయంత్రం సినిమా వివరాలను వెల్లడించనున్నారు.


Mohan Lal Back As Devil : 'లూసిఫర్' సినిమాలో మోహన్ లాల్‌ను రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైన నాయకుడిగా చూపించారు. ముంబై మాఫియాతో అతడిని సంబంధాలు ఉన్నట్లు, కనుసైగతో మాఫియాను శాసించగల సత్తా ఉన్న డాన్‌గానూ పరిచయం చేశారు. ఇక, క్లైమాక్స్‌లో అయితే మోహన్ లాల్ హెలికాఫ్టర్ నుంచి దిగిన షాట్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. ఇప్పుడీ 'లూసిఫర్ 2'లో మోహన్ లాల్ డాన్ రోల్ హైలైట్ కానుందని టాక్. డెవిల్ గా ఆయన చూపించే హీరోయిజం నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని టాక్.


Also Read : యముడికి హాయ్ చెప్పి వచ్చినోడు - 'బిగ్ బాస్' కప్ కొట్టినోడు


చిరు రీమేక్ చేస్తారా?
తెలుగులో 'లూసిఫర్ 2' డైరెక్టుగా విడుదల చేస్తారా? లేదంటే మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే... ఇప్పుడు అంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది కదా! పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన 'కడువ'ను తెలుగులో కూడా విడుదల చేశారు. 'లూసిఫర్' తెలుగులో  డబ్ అయ్యి, విడుదల అయినా రీమేక్ చేస్తున్నారనుకోండి. అది వేరే విషయం. ఇటీవల 'దృశ్యం ౩' కూడా మోహన్ లాల్ స్టార్ట్ చేశారు. ఆ సినిమాకు ముందు వచ్చిన 'దృశ్యం', 'దృశ్యం 2' సినిమాలను తెలుగులో విక్టరీ వెంకటేష్ రీమేక్ చేశారు.  




Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ