Lokesh Kanagaraj Facebook : కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు కోలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి. ఈ విషయమై స్వయంగా లోకేష్ కనగరాజ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు. వివరాల్లోకి వెళ్తే.. లోకేష్ కనగరాజ్ కి సౌత్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖైదీ మూవీతో ఓ సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 'విక్రమ్' సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకొని పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యాడు. ఇక రీసెంట్‌గా 'లియో'తో మరో సెన్సేషనల్ హిట్ సొంతం చేసుకున్నాడు. తలపతి విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది కోలీవుడ్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.


ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. లియో తర్వాత లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కథను రెడీ చేసే పనిలో ఉన్న లోకేష్ తన సినిమాలకు కథ రాసే సమయంలో సోషల్ మీడియాకి కొన్ని నెలల పాటు దూరంగా ఉంటాడు. ప్రతి సినిమాకి ఇదే రూల్ ని ఫాలో అవుతాడు. ఇలాంటి తరుణంలో లోకేష్ కనగరాజ్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అయింది. కోలీవుడ్ మీడియా కూడా ఇదే విషయాన్ని తెగ ప్రచారం చేయడంతో లోకేష్ దీనిపై స్పందించాడు.






ఈ మేరకు తన ట్విట్టర్లో దీనిపై క్లారిటీ ఇస్తూ.. "నేను X అండ్ ఇన్ స్టాగ్రామ్‌లో తప్ప ఇంక వేరే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అకౌంట్స్ లో లేను. కాబట్టి బయట కనిపిస్తున్న వార్తలను పట్టించుకోకండి" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజు కావడంతో లోకేష్ రజనీకాంత్ తో చేస్తున్న 'Thalaivar 171' ప్రాజెక్ట్ కు సంబంధించి ఏదైనా అప్డేట్ బయటకు వస్తుందేమో అని ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ లోకేష్ మాత్రం సింపుల్ గా 'హ్యాపీ బర్త్డే టూ అవర్ తలైవార్ రజనీకాంత్ సార్' అంటూ విష్ చేసి సరిపెట్టాడు. తన ట్వీట్లో కనీసం తలైవా 171 ట్యాగ్ ని కూడా జత చేయకపోవడంతో రజినీ ఫ్యాన్స్ ఈ విషయంలో హర్ట్ అవుతున్నారు.


కాగా ఇటీవలే ఈ డైరెక్టర్ నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టి జి స్క్వాడ్ (G Squad) పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు సోషల్ మీడియాలో లోగోతోపాటు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. "జి స్క్వాడ్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సంస్థ నుంచి తొలిగా నా అసిస్టెంట్స్, స్నేహితులను పరిచయం చేయాలని.. వారిలోని టాలెంట్ ను బయటకు తీసుకొచ్చేందుకే నిర్మాతగా మారాను. ఈ సంస్థ నుంచి ముందుగా వారి సినిమాలే ఉంటాయి. ఈ సినిమాలను కూడా మీరు ఆదరించాలని.. మీ మద్దతు, ప్రేమ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా" అంటూ తెలిపాడు.


Also Read : సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన 'రానా నాయుడు' - ఏకైక ఇండియన్ సిరీస్‌గా ఆ ఘనత!