Vijay Kiragandur On Salaar and Dunki Films Clash: దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్’. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ యాక్షన్ చిత్రాన్నిప్రశాంత్‌ నీల్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అటు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘డుంకీ’ సినిమా కూడా ‘సలార్’తో పాటే విడుదల అవుతోంది. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎమోషనల్ డ్రామా థియేటర్లలో అలరించబోతోంది. ఈ రెండు చిత్రాలతో పాటు హాలీవుడ్ మూవీ ‘అక్వామ్యాన్’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ‘సలార్’ నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


‘సలార్’ కొత్త రికార్డులు సాధిస్తుంది- నిర్మాత విజయ్‌ కిరగందూర్‌


‘సలార్’ సినిమా విడుదల అనేది ఒక పద్దతి ప్రకారం జరుగుతున్నట్లు విజయ్‌ కిరగందూర్‌ తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతోనే గతంలో సినిమా విడుదల వాయిదా పడినట్లు వివరించారు. ఎన్ని సినిమాలు బరిలో నిలిచినా ‘సలార్’ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతోందని వెల్లడించారు. “గత దశాబ్దకాలంగా సినిమాలను ఒకే పద్దతిలో విడుదల చేస్తున్నాం. ‘సలార్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో జాప్యం కారణంగానే విడుదల వాయిదా పడింది.


‘సలార్’ విడుదల రోజునే ‘డుంకీ’, ‘అక్వామ్యాన్’ సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. అయినా, రిలీజ్ డేట్ మార్చాలి అనుకోలేదు. ప్రభాస్‌ నటించిన రీసెంట్ మూవీస్ కొన్ని అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. నిర్మాతగా గత చిత్రాలతో ఈ సినిమాను పోల్చి చూడలేను. సినిమాకు స్టోరీనే కీలకంగా భావిస్తాను. ‘సలార్‌’ కనీవినీ ఎరుగని విజయాన్ని అందుకుంటుందని భావిస్తున్నాను. ప్రభాస్‌ మూవీస్ ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉంటాయి. ఈ సినిమాకు కూడా అలాగే ఉండబోతున్నాయి” అని చెప్పారు.  


తగాదాలు లేకుండా పోటీకి దిగుతున్నాం- నిర్మాత విజయ్‌ కిరగందూర్‌


ఇక ‘సలార్’, ‘డుంకీ’ సినిమాలకు సంబంధించిన స్క్రీన్స్ విషయంలో డర్టీ పోటీ ఉండకూడదని భావిస్తున్నామని విజయ్ వెల్లడించారు. “’సలార్’, ‘డుంకీ’ విషయంలో హెల్దీ కాంపిటీషన్ ఉండాలి అనుకుంటున్నాం. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటీర్స్ తో చర్చలు జరుపుతున్నాం. మా సినిమాలను సోలోగా విడుదల చేసినప్పుడు,  ఆక్యుపెన్సీ 60-70% ఉంటుంది. కానీ, ఇప్పుడు కొన్ని స్క్రీన్లు ‘ఆక్వామ్యాన్‌’కి వెళ్తాయి. ‘సలార్’, ‘డుంకీ’ సినిమాల విషయంలో 50-50 స్క్రీన్లను ఉండాలని మేం భావిస్తున్నాం. ఈ రెండు సినిమాలు 90-100% ఆక్యుపెన్సీని సాధిస్తే మంచి ఫలితం దక్కుతుంది. ‘సలార్’ సోలోగా  విడుదలైతే లభించే దానికంటే స్క్రీన్లు తక్కువగా వచ్చినప్పటికీ, ఎక్కువ ఆక్యుపెన్సీని పొందేలా ప్లాన్ చేస్తున్నాము. ఓవర్సీస్‌లో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎలాంటి తగాదాలకు తావు లేకుండా బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నాం” అని తెలిపారు.  


2018లోనూ రెండు సంస్థల చిత్రాలు పోటీ    


‘సలార్’ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుండగా, ‘డుంకీ’ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ రెండు సంస్థల సినిమాలు గతంలోనూ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. 2018లో షారుఖ్ ఖాన్ నటించిన రొమాంటిక్ డ్రామా ‘జీరో’, యష్ చిత్రం ‘KGF చాప్టర్ 1’  డిసెంబర్ 21న  విడుదలయ్యాయి. ‘KGF’ దేశ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా, ‘జీరో’ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.   


Read Also: ఎన్టీఆర్‌తో నటించాలని ఉంది, మనసులో మాట చెప్పేసిన ‘యానిమల్‘ బ్యూటీ