సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)కు ఓ బాధ్యత తీరింది. పెద్దమ్మాయి ఐశ్వర్య రజనీకాంత్ కోసం ఆయన అంగీకరించిన సినిమా 'లాల్ సలాం'. ఆ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో ఆయన కనిపించనున్నారు. 


'లాల్ సలాం'కు మొయిదీన్ భాయ్ టాటా!
Rajinikanth Role In Lal Salaam : 'లాల్ సలాం'లో ముంబైకి చెందిన మాఫియా డాన్ పాత్రను రజనీకాంత్ పోషించారు. ఆయన క్యారెక్టర్ పేరు మొయిదీన్ భాయ్! లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను రజనీ పూర్తి చేశారు. ఆయనకు చిత్ర బృందం ఘనంగా వీడ్కోలు పలికింది. 


'బాషా' నుంచి మొదలు పెడితే... ఇటీవల వచ్చిన 'కాలా', 'కబాలి' వరకు, సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్నో సినిమాల్లో డాన్ తరహా రోల్స్ చేశారు. మరి, ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) ఆయనను ఎలా ప్రజెంట్ చేస్తారో చూడాలి. మాఫియాకు, క్రికెట్ ఆడే యువకులకు సంబంధం ఏమిటనేది సినిమాలో చూడాలి. 


క్రికెట్ నేపథ్యంలో 'లాల్ సలాం'
క్రికెట్ నేపథ్యంలో 'లాల్ సలాం' రూపొందుతోందని సినిమా అనౌన్స్ చేసినప్పుడు వెల్లడించారు. అయితే... క్రికెట్ ఒక్కటే కాదని, ఈ సినిమాలో క్రికెట్ నేపథ్యంలో జరిగిన అల్లర్లు కూడా ఉంటాయని సమాచారం అందుతోంది. రజనీకాంత్ రాకతో సినిమా సైజ్ పెరిగింది. ప్రేక్షకుల్లో బజ్ ఏర్పడింది. 


విష్ణు విశాల్ (Vishnu Vishal), విక్రాంత్ సంతోష్ (Vikranth Santhosh) హీరోలుగా 'లాల్ సలాం' రూపొందుతోంది. దీనికి ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్నారు. సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. 


Also Read : 'మిషన్ ఇంపాజిబుల్ 7' రివ్యూ : టామ్ క్రూజ్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?


రజనీ సోదరిగా జీవిత!
'లాల్ సలాం'లో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఆయన ఎంత సేపు తెరపై కనిపిస్తారు? అనేది పక్కన పెడితే... కథలో ఆయన పాత్రకు చాలా ప్రాముఖ్యం చాలా ఉంటుందని సమాచారం. రజనీ సోదరిగా జీవితా రాజశేఖర్ కనిపించనున్నారు. 


Also Read : ఏపీ ఎన్నికల తర్వాత బాలకృష్ణ వారసుడి ఎంట్రీ అంతా రెడీ!



రజనీకాంత్ పాత్ర గురించి చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రతినిథులు మాట్లాడుతూ ''లాల్ సలాం'లో ఓ శక్తివంతమైన పాత్ర ఉంది. దాన్ని మరోస్థాయికి తీసుకు వెళ్లే గొప్ప న‌టుడు కావాల‌ని, సూప‌ర్‌ స్టార్ ర‌జనీకాంత్‌ గారిని రిక్వెస్ట్ చేశాం. మాతో ఉన్న అనుబంధం కారణంగా ఆ పాత్రలో నటించడానికి ఆయన ఓకే చెప్పారు. ఎనిమిదేళ్ల త‌ర్వాత ఐశ్వ‌ర్య ర‌జనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 'లాల్ స‌లాం' డిఫరెంట్ మూవీ'' అని చెప్పారు. 


రజనీకాంత్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'జైలర్' విషయానికి వస్తే... ఇటీవల సినిమాలో 'కావాలయ్యా' పాటను విడుదల చేశారు. అందులో రజనీతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా వేసిన స్టెప్పులు డిస్కషన్ పాయింట్ అయ్యాయి ఈ చిత్రానికి 'కొలమావు కోకిల', 'వరుణ్ డాక్టర్', 'మాస్టర్' తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ఇందులో రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులు ప్రధాన తారాగణం. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ ప్రత్యేక పాత్రలు చేస్తున్నారు. 'పుష్ప'లో విలనిజం పండించిన సునీల్, మరోసారి 'జైలర్'లో కూడా విలన్ రోల్ చేస్తున్నారు.