టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్న తరహా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారడు యంగ్ హీరో శ్రీ విష్ణు. తాజాగా 'సామజవరగమన' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ హీరో.. ఈ సినిమాతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం మౌత్ టాక్ తోనే జనాల్లోకి వెళ్లిన ఈ సినిమా విడుదలైన 12 రోజుల్లోనే ఏకంగా రూ.40 కోట్లకు పైన కలెక్షన్స్ అందుకుని నిర్మాతలకు మూడింతల లాభాన్ని తెచ్చిపెట్టింది. సినిమా విడుదలై రెండు వారాలకు పైగా దాటిన ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో అదరగొడుతోంది. కేవలం ఆడియన్స్ మాత్రమే కాదు ఈ మధ్య స్టార్ సెలబ్రిటీ సైతం ఈ సినిమా చూసి ప్రశంసలు కురిపించారు.


రవితేజ, రానా, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలు ఇప్పటికే సినిమాను ప్రశంసించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలో శ్రీ విష్ణు, నరేష్, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్స్ నెక్స్ట్ లెవెల్ ఫన్ జనరేట్ చేసింది. దానికి తోడూ కథా, కథనాలు ఆకట్టుకునే విధంగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. థియేటర్స్ లో విడుదలై నెలరోజులు అవ్వకముందే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. 'సామజవరగమన' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే జూలై 22న నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో 'సామజవరగమన' రిలీజ్ కానున్నట్లు సమాచారం.


కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించి మేకర్స్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయనున్నారట. మొత్తానికి థియేటర్స్ లో రిలీజై భారీ ప్రేక్షకాదరణ దక్కించుకున్న 'సామజవరగమన' విడుదలైన 20 రోజుల్లోనే ఇప్పుడు ఓటీటీలో రాబోతుండటం ఇప్పుడు గమనార్హం గా మారింది. కాగా 'రాజరాజ చోర' వంటి హిట్ తర్వాత 'అర్జున ఫల్గుణ', 'భళా తందనాన', 'అల్లూరి' సినిమాలతో వరుస ప్లాప్స్ అందుకున్న శ్రీవిష్ణుకి 'సామజవరగమన' భారీ కం బ్యాక్ ఇచ్చింది. సుమారు రెండేళ్ల తర్వాత శ్రీ విష్ణు మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.


అంతేకాదు ఈసారి మళ్లీ తనకు అచ్చోచ్చిన కామెడీ జానర్ లోనే హిట్ కొట్టాడు. రామ్ అబ్బరాజు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.' వివాహ భోజనంబు' సినిమా తర్వాత రామ్ అబ్బరాజు డైరెక్టర్ చేసిన సినిమా ఇది. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండ నిర్మించిన ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన రెబ్బా మౌనిక హీరోయిన్గా నటించగా.. సీనియర్ నటుడు నరేష్, వెన్నెల కిషోర్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, రాజీవ్ కనకాల తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. గోపి సుందర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.


Also Read : ఓంకార్ తమ్ముడి సినిమాకి లైన్ క్లియర్ - ఈ నెలలోనే రిలీజ్!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial