Lakshmi Manchu Anger On Fans At SIIMA 2025 Event: తనపై అసభ్యకర కామెంట్స్ చేసిన ఫ్యాన్‌పై టాలీవుడ్ హీరోయిన్ మంచు లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే?
రీసెంట్‌గా దుబాయ్ వేదికగా 'SIIMA 2025' వేడుకలు ఘనంగా జరగ్గా టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు హాజరయ్యారు. అందరితోనూ సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు. ఇదే సమయంలో మంచు లక్ష్మి సైతం వేదిక వద్దకు వెళ్తుండగా కొందరు ఫ్యాన్స్ సెల్ఫీ కావాలని కోరడంతో ఆమె వారి దగ్గరకు వెళ్లారు. అయితే, వెనుక నుంచి ఎవరో అసభ్యంగా కామెంట్ చేయడంతో మంచు లక్ష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఒరేయ్ నా ముందొచ్చి మాట్లాడురా ఎవడో ఆడు. టైం, సెన్స్ లేదు రాస్కెల్స్' అంటూ మండిపడ్డారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అసభ్యకర కామెంట్స్ చేయడం సరి కాదని అంటున్నారు.
Also Read: ఆ పిక్ నా లైఫ్‌ను మార్చేసింది - మెగాస్టార్‌తో బెస్ట్ మూమెంట్ షేర్ చేసుకున్న తేజ సజ్జా
ఆ తర్వాత అక్కడి వారితో సెల్ఫీ దిగి సరదాగా జోకులు వేశారు. అక్కడి నుంచి వెళ్తుండగా... 'అక్కా సెల్ఫీ ప్లీజ్' అంటూ మరికొంతమంది అడగ్గా వారిని ఆప్యాయంగా పలకరించారు. ముంబైలో కూడా తెలుగు ఫోటోగ్రాఫర్లు తనను అక్కా అంటూ పిలుస్తారని చెప్పారు. ఓ చిన్నారి సెల్ఫీ అడగ్గా పేరు అడిగి మరీ సెల్ఫీ ఇచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే... గతేడాది 'ఆదిపర్వం' మూవీలో మంచు లక్ష్మి నటించారు. 'జియో హాట్ స్టార్' యక్షణి సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆమె 'దక్ష' (ది డెడ్లీ కాన్సిఫరిసీ) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని సొంత బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మీదనే తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు వంశీకృష్ణ మల్ల దర్శకత్వం వహించగా... మోహన్ బాబు, మంచు లక్ష్మి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకుంటుండగా... ఈ నెల 19న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటే కరణ్ జోహార్ హోస్ట్ చేసిన 'ది రైటర్స్ ఇండియా' అనే ప్రైమ్ వీడియో షోలో ఓ కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేశారు.