Malayalam Actress Navya Nair Fined For Carrying Jasmine Flowers At Melbourne Airport: విమానంలో మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఓ హీరోయిన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు ఎయిర్ పోర్ట్ అధికారులు రూ.1.14 లక్షల జరిమానా విధించారు. తాజాగా ఓ ఈవెంట్‌లో ఆమె ఈ విషయాన్ని షేర్ చేయగా వైరల్ అవుతోంది.


మెల్ బోర్న్ ఎయిర్ పోర్టులో...


మలయాల హీరోయిన్ నవ్య నాయర్‌కు మెల్ బోర్న్ ఎయిర్ పోర్ట్ అధికారులు ఇటీవల బిగ్ షాక్ ఇచ్చారు. ఇటీవల ఓనం ఉత్సవాల్లో పాల్గొన్న తర్వాత ఆమె మల్లెపూలతో మెల్ బోర్న్ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. కొన్ని పువ్వులు తలలో పెట్టుకోగా మరికొన్నింటిన బ్యాగులో క్యారీ చేశారు. మెల్ బోర్న్ ఎయిర్ పోర్టులో వాటిని గుర్తించిన సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వగా ఆమెకు రూ.1.14 లక్షలు (1980 ఆస్ట్రేలియన్ డాలర్స్) ఫైన్ విధించారు. దీంతో ఆమె జరిమానా చెల్లించారు.


మల్లెపూలు తీసుకెళ్తే ఫైన్ ఎందుకు?


వరల్డ్‌లోనే అత్యంత కఠినమైన బయో సెక్యూరిటీ చట్టాలున్న ఎయిర్ పోర్టుల్లో మెల్ బోర్న్ ఒకటి. ప్రయాణికులు పువ్వులు, పండ్లు, విత్తనాలు తమతో తీసుకెళ్లకూడదు. దీని వల్ల తెగుళ్లు, వ్యాధులు ఈజీగా వ్యాపించే అవకాశం ఉంటుందని ఈ స్ట్రిక్ట్ రూల్ పెట్టారు. ఈ విషయం తెలియని నవ్య నాయర్ తనతో మల్లెపూలు తీసుకెళ్లడంతో కస్టమ్స్ అధికారులు చెక్ చేసి ఆమెకు ఫైన్ విధించారు. 


ఆ తర్వాత ఓ కార్యక్రమంలో నవ్య నాయర్ ఎయిర్ పోర్టులో తనకు ఎదురైన అనుభవం చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. 'నా జర్నీకి ముందు నా తండ్రి నా కోసం మల్లెపూలు కొన్నారు. నేను కొచ్చి నుంచి సింగపూర్ వచ్చేటప్పటికీ అది వాడిపోతుంది. కాబట్టి నేను కొన్ని తలలో పెట్టుకుని మరికొన్నింటిని బ్యాగులో ఉంచాను. నేను క్యారీ బ్యాగులో ఉంచగా ఎయిర్ పోర్టు అధికారులు వాటిని గుర్తించి ఫైన్ వేశారు. నేను తీసుకెళ్లిన పువ్వులు రూ.లక్ష కాస్ట్ అని ఫైన్ వేసే వరకూ నాకు తెలియదు.' అంటూ చెప్పారు నవ్య. దీంతో ఇది వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.


Also Read: పవన్ 'ఓజీ' బీజీఎం మోత మోగిపోవాల్సిందే - 117 మంది మ్యుజీషియన్స్... స్పెషల్ ఇన్‌స్ట్రుమెంట్‌తో తమన్