'బాహుబలి' సినిమాతో దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ సృష్టించిన రికార్డులు ప్రేక్షకులు అందరికీ తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఆ సినిమా కారణం అయ్యింది. బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు దాదాపు 2400 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించాయి. కానీ, కేవలం 50 కోట్ల రూపాయలు పెట్టి బాహుబలి కలెక్షన్లు దాటేస్తానంటూ ఓ బాలీవుడ్ క్రిటిక్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.


కమల్ రషీద్ ఖాన్ అనే ఓ బాలీవుడ్ క్రిటిక్ ఉన్నారు. అతడిని కేఆర్కే అని పిలుస్తుంటారు. హిందీ సినిమా ఇండస్ట్రీలోకి 2006లో హీరోగా అడుగుపెట్టిన కేఆర్కే పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో విమర్శకుడిగా మారి సినిమా రివ్యూలు ఇస్తున్నారు. యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు. సౌత్ సినిమాలు అంటే కేఆర్కే నుంచి ఎక్కువ నెగెటివ్ కామెంట్స్ వస్తాయి. ఇటీవల RRR విడుదల అయినప్పుడు కూడా నెగటివ్ కామెంట్స్ చేసి ప్రేక్షకుల చూపు తన మీద పడేలా చేసుకున్నారు.


RRR అట్టర్ ఫ్లాప్ అనడమే కాదు, అందులో నటించిన హీరోల (ఎన్టీఆర్, రామ్ చరణ్)ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ కామెంట్లు చేశారు కేఆర్కే.  బాహుబలితో RRRను పోలుస్తూ కలెక్షన్ల మీద ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. అటువంటి కేఆర్కే రెండు రోజుల క్రితం 'దేశద్రోహి 2' అనౌన్స్ చేశారు. అందులో తప్పు ఏమీ లేదు. ఎవరు అయినా సరే సినిమా తీయవచ్చు. అయితే... 'బాహుబలి' కలెక్షన్లను దాటే సినిమా తీస్తానని అనడంతో ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 


Also Read: రాజమౌళిని జైల్లో పెట్టాలి, 'RRR' తలా తోకా లేని చిత్రం - ఇతడు రివ్యూ ఇస్తే సినిమా హిట్టే


కేఆర్కే హీరోగా నటించిన సూపర్ ఫ్లాప్ 'దేశద్రోహి' చిత్రానికి సీక్వెలే ఈ 'దేశద్రోహి 2'. రూ. 50 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నట్టు ప్రకటించారు. ఆ సినిమా ఈజీగా 400 నుంచి 500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని చెప్పారు. అంతే కాదు దాన్ని బాహుబలిని మించిన సినిమాగా తీర్చిదిద్దుతానంటూ చేసిన కామెంట్స్ ను సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. కేఆర్కే ఇతర సినిమాలను ట్రోల్ చేయడం కాదు, ఇప్పుడు కేఆర్కే సినిమాలను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 'బాహుబలి' సంగతి పక్కన పెడితే... 'దేశద్రోహి'కి వచ్చిన రేటింగ్ పోస్టర్లు, హీరో ఎక్స్ ప్రెషన్ మీమ్స్ పెడుతూ కేఆర్కేను ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు నెటిజన్లు. అదీ సంగతి. 


Also Read: మహేష్ 'సర్కారు'తో పెద్ద హిట్ కొడుతున్నాం - నిర్మాత కాన్ఫిడెన్స్, ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?