kriti Sanon Comments On Hero Based Movies : బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. పేరుకే హిందీ హీరోయిన్ అయినా ఈమె కెరియర్ స్టార్ట్ అయింది తెలుగులోనే. మహేష్ బాబు సరసన 'వన్ నేనొక్కడినే' సినిమాతో హీరోయిన్ సినీ ఆరంగేట్రం చేసిన కృతి సనన్.. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ వరుస అవకాశాలు అందుకుంది. గత ఏడాది మళ్లీ తెలుగులో 'ఆదిపురుష్' మూవీతో ప్రభాస్ సరసన జతకట్టింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. కాగా బాలీవుడ్ లో అరడజను ప్లాప్స్ తర్వాత ఎట్టకేలకు 'క్రూ' మూవీతో సక్సెస్ రుచి చూసిన కృతి సనన్ తాజా ఇంటర్వ్యూలో స్టార్ హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


స్టార్ హీరో ఉన్నంత మాత్రాన ఆడియన్స్ థియేటర్స్ కి రారు


సినీ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలను నిర్మాతలు ప్రోత్సహించడం లేదని, కేవలం స్టార్ హీరోలతోనే సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తాజా ఇంటర్వ్యూలో కృతి సనన్ చెప్పింది. ఇందులో భాగంగానే స్టార్ హీరోల గురించి మాట్లాడుతూ.." పెద్ద హీరో ఉన్నంత మాత్రాన ఆడియన్స్ థియేటర్స్ కి రారు. కథ బాగుంటే అందులో యాక్టర్స్ ఆడా? మగా? అని చూడరు. బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ కొందరు నిర్మాతలు లేడీ ఓరియంటెడ్ సినిమాలను చిన్న చూపు చూస్తున్నారు. ఈ ధోరణి మారాలి. హీరోలను చూసి థియేటర్స్ కి పరిగెత్తుకుంటూ వచ్చే రోజులు ఇప్పుడు లేవు. పరిస్థితులు మారాయి. 'క్రూ' మూవీలో స్టార్ హీరోలు ఎవరూ లేకపోయినా బాగానే ఆడుతుంది" స్టార్ హీరోలను ఉద్దేశిస్తూ సినిమాలో కంటెంట్ ఉంటే స్టార్ హీరో అవసరం లేదని చెప్పింది.


లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా కలెక్షన్స్ వస్తాయి


'క్రూ' సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ఒక విధమైన మార్పుకు నాందిగా నేను భావిస్తున్నా. ఇప్పటినుంచి అయినా నిర్మాతలు స్టార్ హీరోలకి పెట్టే బడ్జెట్ ని లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా పెడితే బాగుంటుంది. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా వస్తాయి. దానికి ఉదాహరణ ఆలియా భట్ నటించిన 'గంగుబాయి కతీయా వాడి' మూవీ. సంజయ్ లీల బన్సాలి తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు కమర్షియల్ గానూ మంచి సక్సెస్ అయింది" అని తెలిపింది.


'దో పత్తి' ఎంత వరకు వచ్చిందంటే? 


కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో 'దో పత్తి' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో కాజోల్ కూడా మరో లీడ్ రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమాతోనే కృతి సనన్ నిర్మాతగా ఆరంగేట్రం చేస్తోంది. తాజాగా ఈ మూవీ గురించి కృతి సనన్ అప్డేట్ ఇస్తూ.." దో పత్తి షూటింగ్ పూర్తి చేశాం. ప్రజెంట్ ఎడిటింగ్ లో ఉన్నాం. ఈ సినిమా కోసం ఎన్ని చోట్లకి వెళ్లాలనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని షూటింగ్ చాలా వేగంగా పూర్తి చేశాం" అని చెప్పుకొచ్చింది.


Also Read : పూరీ జగన్నాథ్ మా నాన్నతో అలా అన్నారు - 4 రోజులు తర్వాత మూవీ నుంచి తీసేశారు: రకుల్ ప్రీత్ సింగ్