ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన 'అదిపురుష్' ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న గ్రాండ్‌గా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకుల నుంచి ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంది. 'ఆదిపురుష్' మూవీకి పంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అంతేకాదు మొదటివారం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సరి కొత్త రికార్డు నెలకొల్పింది. అయితే సోమవారం నుంచి ఒక్కసారే కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.


రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ రాఘవుడిగా, కృతి సనన్ జానకిగా, సైఫ్ అలీ ఖాన్ లంకేష్ పాత్రలో నటించారు. ముఖ్యంగా సినిమాలో జానకి పాత్రలో కృతి సనన్ అద్భుతమైన నటనను కనబరిచింది. ఆమె నటనకి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. అటు ప్రేక్షకులు సైతం జానకి దేవిగా కృతి సనన్ నటనని కొనియాడారు. ఈ క్రమంలోనే కృతి సనన్ ఇప్పుడు తన ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు తాను చదువుకున్న స్కూల్లోని పిల్లలందరికీ సినిమా చూపించినట్లు వార్తలు వస్తున్నాయి.


లేటెస్ట్ బాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం బుధవారం కృతి సనన్ ఢిల్లీలోని ఓ మల్టీప్లెక్స్ లో ఓ షో కోసం టికెట్స్ బుక్ చేసినట్లు తెలిసింది. ఈ మల్టీప్లెక్స్ లో తాను చదువుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లోని పిల్లలందరినీ ఆదిపురుష్ స్క్రీనింగ్ కి తీసుకెళ్లిందట. వాళ్లతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ స్క్రీనింగ్ కి హాజరైనట్లు సమాచారం. అయితే ఈ స్క్రీనింగ్ కి ఎంత మంది విద్యార్థులు హాజరవుతున్నారనే విషయం పై క్లారిటీ లేదు. కృతి సనన్ బుక్ చేసిన మల్టీప్లెక్స్‌లో సుమారు 300 మంది సినిమాని చూసే వీలు ఉంటుంది.


తాను చదువుకున్న స్కూల్ తో కృతి సనన్ కి ఎంతో మంచి బాండింగ్ ఉంది. గతంలో కూడా ఆమె వరుణ్ ధావన్ తో కలిసి 'బేడియా' అనే సినిమాని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లోనే ప్రమోట్ చేసింది. అంతేకాదు ఇటీవల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కృతి సనన్ సోషల్ మీడియాలో స్కూల్ టీం ని అభినందిస్తూ షేర్ చేసింది. కాగా మరోవైపు 'ఆదిపురుష్' రిలీజ్ తర్వాత నుంచి అనేక రకాల వివాదాలు ఎదుర్కొంటుంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన క్రమంలో మూవీ టీం సినిమాలోని కొన్ని డైలాగ్స్ ని మార్చడానికి సిద్ధమైంది. ఈ సినిమాలోని డైలాగ్స్ రాసిన ప్రముఖ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతశీర్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అంతే కాదు కొంతమంది అయితే ఆయన ఏకంగా చంపేస్తామని బెదిరించడంతో ఆయన తనకు రక్షణ కల్పించాలని తాజాగా ముంబై పోలీసులను ఆశ్రయించారు. ముంబై పోలీసులు కూడా మనోజ్ కి భారీ సెక్యూరిటీని  ఏర్పాటు చేశారు. ఇదొక్కటే కాదు 'ఆదిపురుష్' పై రోజుకో వివాదం తెర పైకి వస్తూనే ఉంది.


Also Read: ఇటలీలో ప్రభాస్‌కు విల్లా? దాని అద్దెతో జీవితాంతం బతికేయొచ్చట!